వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి స్పాట్ పెట్టిన శశికళ !

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఎం. తంబిదురైతో రాజీనామా చేయించాలని, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కరూరు నుంచి తన సమీప బంధువును పోటీ చేయించి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించాలని శశికళ పావులు కదుపుతున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీ అయిన నెచ్చెలి శశికళ ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలోని మరో సీనియర్ నేతను టార్గెట్ చేశారని సమాచారం. పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టడానికి సిద్దం అయిన శశికళ ఇప్పుడు కేంద్రంలో తన సత్తా చాటడానికి పావులు కదుపుతున్నారు.

షాక్: పన్నీర్ సెల్వంకు చెక్ ? కేబినేట్ అత్యవసర సమావేశం

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ మునిస్వామి తంబిదురై అలియాస్ ఎం. తంబిదురైతో రాజీనామా చేయించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరూరు నుంచి వరుసగా ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తంబిదురైకి కేంద్రంలో మంచి గుర్తింపు ఉంది. 2014 ఆగస్టు 12వ తేదిన తంబిదురై లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే సీఎం కుర్చిలో కుర్చోన్న తరువాత కేంద్ర ప్రభుత్వంతో తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి శశికళ ఇప్పుడు చక్రం తిప్పడానికి సిద్దం అయ్యారు.

షాక్.. శశికళ తమిళనాడు సీఎం: జయలలిత మేనళ్లుడు దీపక్

తంబిదురై చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించి కరూరు లోక్ సభ స్థానం నుంచి తన సమీప బంధువును పోటీ చేయించి గెలిపించాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. శశికళ సీఎం కావాలని తంబిదురై తన లోక్ సభ డిప్యూటీ స్పీకర్ లెటర్ హెడ్ లో ప్రకటన చేసి విమర్శలపాలైనారు.

Deputy Speaker of LOk Sabha M Thambidurai and AIADMK chief Sasikala

తంబిదురైని తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తే పాలనాపరంగా తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని శశికళ నిర్ణయించారని తెలిసింది. తంబిదురైని ఒప్పించడానికి తన సన్నిహితులైన సీనియర్ మంత్రి ఉదయ్ కుమార్, మరో ముగ్గురు మంత్రులను తంబిదురైతో చర్చించాలని శశికళ సూచించారు.

మీకో దండం: పన్నీర్ సెల్వం రాజీనామా ? శశికళ చేతిలో లేఖ

తన సమీప బంధువు ఎంపీగా వెళ్లి ఢిల్లీలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇస్తారని, తరువాత కేంద్ర ప్రభుత్వంతో తనకు సంబంధాలు బలపడుతాయని శశికళ ప్లాన్ వేశారు. అయితే తంబిదురై లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే అవకాశం తక్కువగా ఉందని ఆయన అనుచరులు అంటున్నారు.

జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తంబిదురైతో పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించి ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తంబిదురై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? వేచిచూడాలని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.

English summary
AIADMK leader M Thambidurai was unanimously elected as the deputy speaker of the Lok Sabha on Wednesday 12 August 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X