వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా కేసు: అస‌లు కోర్టు రూమ్‌లో ఏం జ‌రిగిందంటే..?, బాబా రాందేవ్ స్పందన!

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ అత్యాచార కేసులో తీర్పు ఇవ్వాల్సిన జ‌డ్జి జ‌గ్‌దీప్‌సింగ్ సోమవారం రోహ్‌త‌క్ జైలుకు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో వ‌చ్చారు. మ‌ధ్యాహ్నం రెండున్న‌ర గంట‌ల‌కు విచార‌ణ మొద‌లుకా

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రోహ్‌త‌క్‌: రేపిస్ట్ బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ కు సీబీఐ కోర్టు ప‌దేళ్ల జైలు శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. రేప్ కేసులో గుర్మీత్‌ను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు.. సోమవారం రోహ్‌త‌క్ జైల్లోనే ప్ర‌త్యేకంగా కోర్టు ఏర్పాటు చేసి శిక్ష విధించింది.

ఈ సందర్భంగా.. త‌ప్ప‌యిపోయింద‌ని, క‌రుణించాల‌ని డేరా బాబా చేతులు క‌ట్టుకొని వేడుకున్నా న్యాయ‌మూర్తి మాత్రం క‌రుణించ‌లేదు. అంత‌కుముందు జ‌డ్జి జ‌గ్‌దీప్‌సింగ్ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో జైలుకు వ‌చ్చారు. మ‌ధ్యాహ్నం రెండున్న‌ర గంట‌ల‌కు విచార‌ణ మొద‌లుపెట్టారు.

Dera Baba Case - What happened in Court Room..? Reaction of Baba Ramdev on court's verdict..

ఇరు వ‌ర్గాలు వాద‌న‌లు వినిపించ‌డానికి చెరో ప‌ది నిమిషాలు కేటాయించారు. గుర్మీత్ ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేశాడ‌ని, సాధ్య‌మైనంత త‌క్కువ శిక్ష వేయాల‌ని డిఫెన్స్ లాయ‌ర్లు జ‌డ్జిని కోరారు.

అయితే సీబీఐ మాత్రం అత్యాచారానికి గ‌రిష్ఠ శిక్ష అయిన జీవిత ఖైదు విధించాల‌ని కోరింది. త‌న‌ను న‌మ్మిన భ‌క్తుల‌ను మోసం చేశాడ‌ని సీబీఐ వాదించింది. మ‌రో 45 మంది మ‌హిళ‌లు కూడా త‌మ‌ను గుర్మీత్ రేప్ చేశాడ‌ని చెబుతున్నా.. బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని సీబీఐ స్ప‌ష్టంచేసింది. ఒక్క‌సారి కాదు మూడేళ్ల కాలంలో వేర్వేరు ప్ర‌దేశాల్లో ఎన్నోసార్లు త‌న భ‌క్తుల‌పై గుర్మీత్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని సీబీఐ ఆరోపించింది.

అయితే ఢిపెన్స్ లయార్లు మాత్రం.. గుర్మీత్ పై ఇన్ని ఆరోప‌ణ‌లు ఉన్నా.. స‌మాజంలో ఆయనకి ఉన్న పేరు ప్ర‌తిష్ట‌ల దృష్ట్యా అయినా శిక్ష త‌గ్గించాల‌ని కోరారు. అయితే ఇప్ప‌టికే రెండు రేప్ కేసుల్లో గుర్మీత్ దోషి అని తేలడంతో.. ఆయన ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని మాత్రం డిఫెన్స్ లాయ‌ర్లు వాదించ‌లేదు.

గ‌తంలో ఆయనపై ఎలాంటి క్రిమిన‌ల్ కేసులు లేవు కాబట్టి శిక్ష త‌గ్గించాల‌ని మాత్రం కోరారు. సెక్ష‌న్ 376 కింద అత్యాచార నేరానికి క‌నీసం ఏడేళ్లు, గ‌రిష్ఠంగా జీవిత ఖైదు (14 ఏళ్లు) విధిస్తారు. జ‌డ్జిమెంట్ వినగానే గుర్మీత్ జడ్జి ముందు ప్రాధేయ‌ప‌డ్డాడు. క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ద‌య చూపాల‌ని వేడుకున్నాడు. త‌క్కువ శిక్ష‌తో వ‌దిలేయాల‌ని కోరాడు.

''చ‌ట్టం నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌ని కోర్టు నిరూపించింది..''

రేప్ కేసులో డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కు ప్ర‌త్యేక సీబీఐ కోర్టు ప‌దేళ్ల జైలు శిక్ష విధించడంపై బాబా రాందేవ్ స్పందించారు. చ‌ట్టం నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌ని కోర్టు నిరూపించింద‌ని ఆయన వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు పంజాబ్ మాత్రం రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది. బ‌ర్నాలాలో భారీ సంఖ్య‌లో భద్రదతా ద‌ళాలు ప‌హారా కాస్తున్నాయి. గుర్మీత్‌కు శిక్ష‌ను ఖ‌రారు చేసిన త‌ర్వాత పెద్ద ఎత్తున్న అల్ల‌ర్లు జ‌రిగే అవ‌కాశం ఉన్న కార‌ణంగా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను పెంచారు.

English summary
A special CBI court on Monday sentenced Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh to 10 years of rigorous imprisonment. The dera chief was convicted of rape on August 25. Earlier today, CBI judge Jagdeep Singh was flown in a helicopter to Sunaria Jail, where a special court room was set up for pronouncing the quantum of sentence in a rape case. A three-tier security ring has been installed around Rohtak’s Sunaria district jail. The administration has issued a stern warning and is keeping vigil in the states of Haryana, Punjab and Delhi ahead of the announcement of sentence keeping in mind the violence that broke out after the verdict was announced where 38 people were killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X