వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా జైలు జీవితం: తట్ట బుట్టా పట్టుకుని.. మట్టిపని చేస్తూ.., పులిమీద పుట్రలా కోర్టు కూడా...

వేలకోట్లకు అధిపతి అయిన డేరా బాబా ప్రస్తుతం ఏం చేస్తున్నాడో తెలుసా? రోజుకో సాధ్వీతో శృంగార కార్యకలాపాల్లో మునిగితేలిన గుర్మీత్ ఇప్పుడు జైల్లో ఎలా రోజులు గడుపుతున్నాడో తెలుసా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రోహ్ తక్: వేలకోట్లకు అధిపతి అయిన డేరా బాబా ప్రస్తుతం ఏం చేస్తున్నాడో తెలుసా? రోజుకో సాధ్వీతో శృంగార కార్యకలాపాల్లో మునిగితేలిన గుర్మీత్ ఇప్పుడు జైల్లో ఎలా రోజులు గడుపుతున్నాడో తెలుసా?

డేరా సచ్ఛా సౌదాలో సకల భోగాలు అనుభవించిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతం రోహ్ తక్ జైల్లో అష్టకష్టాలు పడుతున్నాడు. ఆయనను జైలు అధికారులు సాధారణ ఖైదీగానే చూస్తున్నారు.

తట్టాబుట్టా మోస్తూ.. మట్టిపనిలో...

తట్టాబుట్టా మోస్తూ.. మట్టిపనిలో...

తనకు ఎదురుతిరిగిన వారిని అంతమొందించి ఎవరికీ తెలియకుండా డేరాలోనే పాతిపెట్టించిన డేరాబాబా ఇప్పుడు దిక్కులేని వాడిలా.. రోజు కూలీగా మారిపోయి.. మట్టి పని చేస్తున్నాడు. రోజంతా ఒళ్లు హూనం చేసుకుంటే ఆయనకు లభిస్తోన్న కూలి ఇరవై రూపాయలు. నెల రోజుల నుంచి డేరా బాబా తట్టా బుట్టా పట్టుకుని జైల్లో పనిచేస్తున్నాడు. ఆహారం విషయంలోనూ అంతే.. సాధారణ ఖైదీలకు పెట్టేదే డేరాబాబాకూ పెడుతున్నారు. జైలుకు వచ్చిన కొత్తలో ఖైదీలకు పెట్టే తిండి తిననంటూ గుర్మీత్ కాస్త గీరపోయాడుగానీ.. ఇప్పుడు అలాంటి పప్పులేమీ ఉడకడం లేదు. ఒకరోజా.. రెండ్రోజులా.. ఇరవై ఏళ్లు జైల్లోనే ఉండాలి మరి. తిండి తినకపోతే రోజూ మట్టి పని చేయడం ఎలా? అందుకే గప్ చిప్ గా తినేస్తున్నాడు.

పాపం ధ్యాసంతా ‘హనీ’ గురించే...

పాపం ధ్యాసంతా ‘హనీ’ గురించే...

డేరా బాబాకు జైల్లో కనీసం న్యూస్ పేపర్ కూడా ఇవ్వడం లేదు. ఇక జైలు గదిలో టీవీ కూడా లేదాయె. మరి బయటి సంగతులు ఆయనకు ఎట్టా తెలిసేది చెప్మా! అదే ఇప్పుడు పెద్ద దిగులైపోయింది డేరాబాబాకి. ముఖ్యంగా తనకు అత్యంత ‘ప్రియ'మైన దత్తపుత్రిక హనీప్రీత్ ఎక్కడుందో? ఏం చేస్తుందో? పాపాం.. హనీప్రీత్ గురించి ఏ విషయమూ తెలియక విలవిల్లాడిపోతున్నాడు. జైలుకొచ్చిన కొత్తలో ‘ఇదిగో హనీ సెల్ నంబర్.. కాస్త మాట్లాడిద్దురూ..' అంటూ జైలు అధికారుల కాళ్లా వేళ్లా పడ్డారు. అయినా ఫలితం కానరాలేదు. గుర్మీత్ జైలుకు వచ్చిన రెండ్రోజులకే.. హనీప్రీత్ కూడా డేరా నుంచి జంప్ అయింది. ఇది వరకు ఆమె ఉపయోగించిన ఫోన్ నంబర్లు కూడా ఇప్పుడు పనిచేయడం లేదు. దీంతో డేరా బాబా నిద్రలోనూ ఆమెనే కలవరిస్తున్నాడు.

ఆస్తుల లెక్క తేల్చండి: కోర్టు ఆదేశం

ఆస్తుల లెక్క తేల్చండి: కోర్టు ఆదేశం

డేరా బాబా గుర్మిత్ సింగ్ ఆస్తులు, ఆయన ఆర్థిక వ్యవహారాలపై లెక్క తేల్చాలని ఆదాయపన్ను శాఖ(ఐటీ)తోపాటుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కూడా హర్యానా, పంజాబ్ కోర్టు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ఐటీ, ఈడీ డేరా ఆస్తులపై ఆరా తీస్తున్నాయి.

డేరా ఆస్తుల విలువ ఎంతంటే...

డేరా ఆస్తుల విలువ ఎంతంటే...

సిర్సాలో డేరా ఆస్తుల విలువ రూ. 1453 కోట్లని హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు హైకోర్టుకు ఆఫిడవిట్ సమర్పించింది. అయితే హర్యానా వ్యాప్తంగా రూ. 1600 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పింది. రాష్ట్రం అవతల కూడా డేరాకు ఆస్తులు ఉన్నాయని, వాటి వివరాలు తమ వద్ద లేవని తెలిపింది. అయితే వాటి ధర మార్కెట్‌లో చాలా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సిర్సాలో 1453, అంబాలలో 32, జజ్జర్‌లో 29, ఫతేహాబాద్‌లో 21, జింద్‌లో 19, సోనిపేట్‌లో 18 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

అల్లర్లలో ఆస్తినష్టానికి పరిహారం...

అల్లర్లలో ఆస్తినష్టానికి పరిహారం...

కురుక్షేత్ర, ఖతిహాల్, హిస్సార్, కర్నాల్, బివాని, యమునా నగర్, పానిపట్, ఫరీదాబాద్, రోహ్ తక్, రేవారిలోనూ డేరా బాబాకు ఆస్తులు ఉన్నాయి. డేరాబాబాను దోషిగా ప్రకటించాక పంచకుల సహా చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దీనికి పరిహారం చెల్లించాలంటూ డేరా సచ్ఛ సౌధాను న్యాయస్థానం ఆదేశించింది. ఈ డబ్బును డేరా వారసులు చెల్లించని పక్షంలో డేరా సచ్ఛ సౌధా ఆస్తులను వేలం వేయాలని కోర్టు సూచించింది.

English summary
Gurmeet Ram Rahim Singh was not just a (self-confessed) godman, he was also a millionaire, the Haryana government has revealed. In a report that the ML Khattar government will submit to the Haryana and Punjab High Court today, the Dera Sacha Sauda, the controversial sect run by Ram Rahim, has been valued at Rs 1,453 crore. This is just in Sirsa, where the Dera headquarters are located. The Haryana government has estimated that Gurmeet Ram Rahim's organisation owns properties worth around Rs 1,600 crore across the state. The government estimate does not include properties that the Dera owns outside of Haryana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X