వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ గ్రామంపై పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం లేదు

దేశమంతా కరెన్సీ కష్టాలు పడుతోంటే మహారాష్ట్రలోని దేశాయి గ్రామ ప్రజలు కరెన్సీ కోసం ఇబ్బందులు పడడం లేదు. ఈ గ్రామంలో గురువారం నుండి నగదురహిత లావాదేవీలు ప్రారంభమయ్యాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబాయి :పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మహారాష్ట్రలోని దేశాయి గ్రామంమాత్రం కొత్త రెన్సీ కోసం ఇబ్బందులు పడడంల లేదు. రద్దు చేసిన నగదు నోట్లను మార్పిడి చేసుకొనేందుకు బ్యాంకుల చుట్టూ తిరగడం లేదు. ఈ గ్రామం దేశంలోనే నగదు రహిత గ్రామంగా మారింది. దీంతో ఈ గ్రామానికి కరెన్సీ కష్టాలు లేవు.

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని దేశాయి గ్రామం నగదు రహిత గ్రామంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ గ్రామవాసులంతా నగదు లేకుండా తమ పనులను చేసుకొంటున్నారు. అన్నింటికి కార్డులను ఉపయోగిస్తున్నారు.త్వరలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఇదే విదానాన్ని అమలు చేస్తామని మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

deshayi first cashless village in maharastra

బ్యాంకు ఆఫ్ బరోడా సహకారంతో దేశాయి గ్రామంలో ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా నగదు రహిత పద్దతిని ఉపయోగిస్తున్నారు. స్వైప్ మిషన్లు, లేదా డెబిట్, క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.గురువారం నుండి ఈ గ్రామం నగదు రహిత గ్రామంగా మారిందని మహారాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సుధీర్ మంగన్ తివార్ తెలిపారు.

గ్రామంలోని ప్రతి వ్యాపారి స్వైపింగ్ మిషన్ ను ఉపయోగిస్తున్నారని మంత్రి తెలిపారు.ముర్బాద్ తాలుకాలోని దేశాయి గ్రామంలో 10 వేల మంది జనాభా ఉన్నారు. చుట్టుపక్కల 60 గ్రామాల ప్రజలు అన్ని అవసరాల కోసం ఈ గ్రామానికి వస్తుంటారు. నగదు రహిత లావాదేవీలను ప్రారంభించడంతో కరెన్సీ కష్టాలు తప్పాయని స్థానికులు చెబుతున్నారు.

English summary
currency ban effect not reflect in deshayi village , bank fo baroda, ngo organation implement cashless vilage in maharastra.every business man use swipeing machines , entire maharastra state will soon cashless said maharastra finance minister,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X