వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయం చేయాలని మోడీకి అత్యాచార బాధితురాలి లేఖ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనకు న్యాయం చేయాలని అత్యాచారానికి గురైన బాధితురాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాసింది. రాజకీయ పలుకుబడితో ఈ కేసును వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు తనకు సహకరించడం లేదని ఆమె ఆ లేఖలో ఆవేదనను వ్యక్తం చేశారు. నిందితుల తరపునే పోలీసులు మాట్లాడుతున్నారని బాధితురాలు ఆ లేఖలో చెప్పారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె ఆ లేఖలో కోరింది.

Desperate for justice, rape victim writes in blood to PM Modi, CM Adityanath

తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బాధితురాలు ఆ లేఖలో ఆవేదనను వ్యక్తం చేసింది. అయితే ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

దివ్యాపాండే, అంకిత్‌వర్మలతో పాటు మరో వ్యక్తిపై కేసులు నమోదు చేశామన్నారు. అత్యాచార దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినందుకు కూడ కేసు నమోదు చేశామని చెప్పారు.

English summary
A rape victim in Uttar Pradesh’s Raebareili has reportedly written a letter in her blood to Prime Minister Narendra Modi and Chief Minister Yogi Adityanath, demanding justice and action against those responsible for her state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X