వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయనకే చెల్లింది: కాంగ్రెసు ఓడినా హార్దిక్ పటేల్ హీరోనే

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పోరాడి ఓడింది. అయితే, కాంగ్రెసు ఓటమి చవి చూసినప్పటికీ హర్దిక్ పటేల్ బలమైన నాయకుడిగా ముందుకు వచ్చాడు. కేశూభాయ్ పటేల్ తర్వాత అంత బలమైన నాయకుడిగా ముందుకు వచ్చింది ఆయనే.

ఫైర్ బ్రాండ్ హార్దిక్ పటేల్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నియోజకవర్గమైన రాజ్‌కోట్ వెస్ట్ లాంటి ప్రాంతాల్లో ఆయన ర్యాలీలు, బహిరంగ సభలకు పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన పెద్ద యెత్తున ప్రజలను ఆకట్టుకోవడంలో ఫలితం సాధించారు. తమ పాటిదార్ల వర్గం సంఘటితంగా ఉండడానికి ఆయన కృషి ేచశారు.

 బిజెపికి హార్దిక్ ఇలా...

బిజెపికి హార్దిక్ ఇలా...

తాము 150కి పైగా సీట్లను సాధిస్తామని బిజెపి కలలు కన్నది. ఆ కలలను భగ్నం చేయడంలో హార్దిక్ పటేల్ విజయం సాధించారు. గుజరాత్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. కేశూభాయ్ పటేల్ తర్వాత పాటిదార్ల ప్రధాన నాయకుడిగా ఆయన ముందుకు వచ్చారు. ఆయన ర్యాలీలకు పెద్ద యెత్తున ప్రజల హాజరయ్యారు. దాన్ని బట్టే ఆయనకు ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు.

 వ్యూహాత్మకంగా హర్దీక్ పటేల్...

వ్యూహాత్మకంగా హర్దీక్ పటేల్...

తమ వ్యూహాత్మక మిత్రులతో సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి హార్దిక్ పటేల్ ప్రయత్నించి విజయం సాధించారు. తన బలాన్ని పెంచుకున్నారు. ఖోడాల్ధామ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ నరేష్ పటేల్‌తో ఆయన జరిపిన సమావేశమే అందుకు నిదర్సనం. పాటిదార్లకు సంబంధించి అది అత్యంత ప్రధానమైన ఆలయం గుజరాత్ పాటిదార్ల ఉప కులం సంఖ్యరీత్యా ల్యూవా పటేల్స్ అతి పెద్దది.

హార్దీక్ పటేల్ ఇక్కడి నుంచి.

హార్దీక్ పటేల్ ఇక్కడి నుంచి.

హార్దిక్ పటేల్ కద్వా కమ్యూనిటికీ చెందినవరు. పాటిదార్లలో ఈ ఉప కులం 30 శాతం ఉంటుంది. అయితే, రెండు ఉప కులాల్లోనూ హార్దీక్ పటేల్‌కు మంచి మద్దతు ఉంది. అందువల్ల ఖోదాల్దామ్ ట్రస్టు ప్రాముఖ్యత ఏమిటో ఆయనకు తెలుసు. ఎన్నికలకు ముందు బలమైన కమ్యూనిటిని తన వెంట తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు. నరేష్ పటేల్‌తో ఆయన సమావేశం విజయం సాధించింది.

 ఇలా మద్దతు ప్రకటించారు...

ఇలా మద్దతు ప్రకటించారు...

తాము ఏ పార్టీకి వ్యతిరేకం గానీ అనుకూలం గానీ కాదంటూ పాటిదార్ల అనామత్ ఆందోళన్ సమితి డిమాండ్‌ను శ్రీ ఖోదాల్గామ్ ట్రస్టు మద్దతు ప్రకటించింది. నరేష్‌‌ పటేల్‌‌తో 15 నిమిషాలు సమావేశమైన తర్వాత బయటకు వచ్చిన హార్దిక్ పటేల్ ఖోదాల్దామ్ ఆశీస్సులు, నరేష్ పటేల్ ఆశీస్సులు తమకు ఉన్నాయని ప్రకటించారు.

 విభజించడానికి ప్రయత్నిస్తున్నారని....

విభజించడానికి ప్రయత్నిస్తున్నారని....

తమ కద్వా ల్యూవాలకు విభజించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, వారు ప్రజలను విభజించడానికే చూస్తారని, తాము పాటిదార్లం తామంతా ఒక్కటే, బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయండని, మార్పుకు సిద్ధం కండని ఓ ర్యాలీలో హార్దిక్ పటేల్ చెప్పారు. మనం ఏకం కాకపోతే తమను బలహీనులుగా పరిగణిస్తారని, వాళ్లు పాటిదార్లైనా, దళితులైనా, కోలిలైనా అందరూ గుజరాత్‌లో అసంతృప్తితో ఉన్నారని హార్దిక్ పటేల్ అన్నారు.

బిజెపిలో చాలా మంది పాటిదార్ల నేతలే...

బిజెపిలో చాలా మంది పాటిదార్ల నేతలే...

గుజరాత్‌లో పాటిదార్ల నేతగా గుర్తింపు పొందడానికి చాలా మందే పోటీ పడ్డారు. మాజీ ఆనందిబెన్ పటేల్, గుజరాత్ డిప్యూటీ సిఎం నితిన్ పటేల్ కూడా వారిలో ఉన్నారు. అయితే, హార్దీక్ పటేల్ మాదిరిగా ప్రజలను ఆకట్టుకోవడంలో ఎవరు కూడా ఫలితం సాధించలేదు. హార్దిక్ పటేల్ రాజకీయ నేతగా పాటిదార్ల నాయకుడిగానే కాకుండా ఇతర కమ్యూనిటీల నాయకుడిగా కూడా ముందుకు వచ్చారు.

బిజెపి కోటలోనే హార్దిక్ సవాల్

బిజెపి కోటలోనే హార్దిక్ సవాల్

బిజెపికి పెట్టని కోటల్లా ఉన్న ప్రాంతాల్లో కూడా ఆ పార్టీకి హార్దిక్ పటేల్ సవాల్ విసిరారు. రెండేళ్ల క్రితం హింస చెలరేగినప్పటి నుంచి కద్వా పటేల్ కమ్యూనిటీ బలంగా ఉన్న మెహసనా జిల్లాలోకి వెళ్లకుండా హార్దిక్ పటేల్‌పై నిషేధం విధించారు. అది నరేంద్ర మోడీ సొంత జిల్లా కూడా. అయితే, మెహసనా జిల్లా సరిహద్దులోని పటాన్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. లక్షలాది మంది ఆ సభకు తరలివచ్చారు.

English summary
Hardik has not only emerged as a central figure in Gujarat politics, he is now the contender for the crown of Gujarat’s foremost Patidar leader after former CM Keshubhai Patel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X