బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్ కాలా బెంగళూరులో విడుదల, తెలుగు, తమిళ్, 45 మల్టీఫ్లెక్స్ లు, ఫ్యాన్స్ హ్యాపీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా బెంగళూరులో విడుదల అయ్యింది. కన్నడ సంఘాలు వ్యతిరేకిస్తున్నా భారీ పోలీసు బందోబస్తుతో రజనీకాంత్ నటించిన కాలా సినిమాను విడుదల చేశారు.

తెలుగు, తమిళ్, హిందీ

తెలుగు, తమిళ్, హిందీ

బెంగళూరు నగరంలోని మెజస్టిక్ సమీపంలో భూమికా థియేటర్ లో కాలా తెలుగు సినిమా శుక్రవారం విడుదల చేశారు. బెంగళూరు నగరంలోని గాంధీనగర్ సమీపంలోని అభినయ్ లో కాలా (హిందీ), మాగడి రోడ్డులోని అంజన్ థియేటర్ లో, శ్రీరాంపురలోని అరుణ, పుష్పాంజలి, శ్రీనివాస తదితర థియేటర్ లో కాలా తమిళ సినిమా విడుదల చేశారు.

45 మల్టీఫ్లెక్స్ లు

45 మల్టీఫ్లెక్స్ లు

గురువారం బెంగళూరు నగరంలోని మంత్రి మాల్, గరుడా మాల్, ఐనాక్స్ తదితర మాల్స్ లో కాలా సినిమా ప్రదర్శన నిలిపివేశారు. శుక్రవారం దాదాపు అన్ని మాల్స్ లో, 45 మల్టీఫ్లెక్స్ థియేటర్లలో కాలా సినిమా విడుదల చేశారు. మాల్స్ దగ్గర పోలీసులు అధిక సంఖ్యలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

 భారీ బందోబస్తు

భారీ బందోబస్తు

కన్నడ సంఘాలు ఆందోళనతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. గురువారం జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రజనీకాంత్ అభిమానులు సినిమా చూడటానికి భారీ సంఖ్యలో థియేటర్ల దగ్గరకు చేరుకుంటున్నారు.

ఆన్ లైన్ లో టిక్కెట్లు ఖాళీ

ఆన్ లైన్ లో టిక్కెట్లు ఖాళీ

గురువారం ఉదయం నుంచి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ సంఘాలు ఆందోళన చెయ్యడంతో పలు ప్రాంతాల్లో కాలా సినిమా విడుదల కాలేదు. కొన్ని చోట్లు కాలా సినిమా విడుదల అయినా సంగంలో సినిమా ప్రదర్శన నిలిపివేశారు. బుక్ మై షోలో కాలా సినిమా టిక్కెట్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. అనేక మల్టీఫ్లెక్స్ ల్లో అన్ని షోల టిక్కెట్లు ఇప్పటికే ఆన్ లైన్ లో ఖాళీ అయ్యాయి.

English summary
Despite the controversy the Kaala movie is released in Bangaluru today(JUNE 8) Kaala Cinema Booking Open at over 45 centers at Book My Show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X