వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దార్థ్ విశిష్ట్ దూరమైన బాధలోనూ దేశభక్తి చూపిన భార్య .. స్క్వాడ్రన్ లీడర్ గా భర్తకు నివాళి

|
Google Oneindia TeluguNews

భర్త మరణం ఆమెకు తీరని దుఃఖాన్ని మిగిల్చినా , తన కర్తవ్యాన్ని మాత్రం వీడలేదు. భారతదేశ రక్షణ వ్యవస్థలో వీరోచితంగా పోరాడుతున్న వీరుల కుటుంబాలలో ఉన్న అతివలు సైతం అంతే ధీరత్వాన్ని, తెగువను చూపిస్తున్నారు. కళ్ళముందు విగతజీవిగా పడి ఉన్న భర్తను చూస్తున్నా పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని ఒక స్క్వాడ్రన్ లీడర్ గా యూనిఫామ్ తో అంత్యక్రియలకు హాజరై భర్తకు నివాళులర్పించింది ఓ ధీర చరిత . దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న ఇలాంటి వీరులు, వీరవనితలు ఉన్నంతకాలం భారత దేశ జెండా సగర్వంగా ఎగురుతూనే ఉంటుంది.

భారత దేశ రక్షణ కోసం పోరాటం చేస్తూ జమ్మూ కాశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో భర్త వీరమరణం పొందినా.. భార్య తన కర్తవ్యాన్ని మాత్రం వీడలేదు. యూనిఫాంలోనే అంత్యక్రియలకు హాజరై.. నివాళులర్పించింది. ఈ సంఘటన చూసిన వారందరికీ హృదయాలు బరువెక్కాయి. ప్రతి ఒక్కరి మనసు ను ఈ సంఘటన కలిచివేసింది.జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో ఎంఐ-17 ఛాపర్‌ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన స్క్వాడ్రన్‌ లీడర్‌ సిద్ధార్థ్‌ వశిష్ట్‌ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చండీగఢ్‌లో జరిగాయి. వశిష్ట్‌ భార్య ఆర్తీసింగ్‌ కూడా ఒక స్క్వాడ్రన్ లీడర్ కావడంతో తన భర్త అంత్యక్రియలకు ఆమె యూనిఫామ్‌తో హాజరై తన దేశభక్తిని చాటుకుంది. భారత వాయుసేన అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. ఐఏఎప్‌ అధికారులతో కలిసి కన్నీటితో తన భర్తకు ఆర్తి నివాళులు అర్పించింది.

 Despite the death of Siddharth vishisht his wife showed patriotism....tribute to husband as Squadron Leader

భారత జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని ఉన్న ఆమెను చూసిన వారిందరి హృదయాలు బరువెక్కాయి.ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భర్త దూరమైనా, దేశం కోసం ప్రాణత్యాగం చేసినా మొక్కవోని ధైర్యంతో భారత జెండాను చేతబూని ఈ పర్యంతమవుతూ భర్తకు నివాళులర్పించిన భరతమాత ముద్దుబిడ్డ ఆర్తి సింగ్ కు, భారత దేశం కోసం అసువులు బాసిన సిద్ధార్థ వశిష్ట్ కు సగర్వంగా సెల్యూట్ చేస్తుంది భారతదేశం.

English summary
Indian Air Force (IAF) Squadron Leader Siddharth Vashisht, who was piloting a Mi-17 chopper when it crashed in Jammu and Kashmir's Budgam district, was cremated with full military honours at Chandigarh . The funeral was attended by his wife Aarti Singh, also a Squadron Leader, besides relatives, military officers .The hearts of those who have seen her have paid tribute to her husband with uniform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X