• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నన్నే విస్మరిస్తారా..! గతాన్ని మరచిపోయారా మోడీ..! మాజీ ప్రధాని దేవెగౌడ విసుర్లు

|

బెంగళూరు : ప్రధాని మోడీ తీరు మాజీ ప్రధాని దేవెగౌడకు కోపం తెప్పించిందా? మోడీ తనను విస్మరించారని ఆయన ఫీలవుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. బోగీబీల్ వంతెన ప్రారంభోత్సవానికి తనను పిలవకపోవడం బాధాకరమంటున్నారు దేవెగౌడ.

బోగీబీల్ వంతెనకు శంకుస్థాపన చేసిన తననే విస్మరిస్తారా అనేది దేవెగౌడ కోపానికి కారణం. ప్రారంభోత్సవానికి తనను పిలవాల్సి ఉన్నా.. ప్రధాని మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

నేనే పునాది వేశా.. నన్నే విస్మరించారు

నేనే పునాది వేశా.. నన్నే విస్మరించారు

దేశంలోనే పొడవైన రైల్‌-కమ్‌-రోడ్‌ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సందర్భంగా.. మాజీ ప్రధాని దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అస్సాం ఒప్పందంలో భాగంగా నిర్మించిన బోగీబీల్‌ వంతెనకు 1997 లోనే ఆమోదం లభించింది. అదే ఏడాది జనవరి 22న అప్పటి ప్రధానిగా ఉన్న హెచ్‌డీ దేవెగౌడ శంకుస్థాపన చేశారు. అయితే పునాది వేసిన తనను ప్రధాని మోడీ విస్మరించారని ఆరోపిస్తున్నారు దేవెగౌడ. బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడం బాధాకరమంటున్నారు.

హైదరాబాద్‌కు దేవెగౌడ: కేసీఆర్‌తో భేటీ, తాజా పరిస్థితిపై చర్చ

ప్రాజెక్టులకు పెద్దపీట వేశా.. అలాంటిది నన్నే..!

ప్రాజెక్టులకు పెద్దపీట వేశా.. అలాంటిది నన్నే..!

ప్రధానిగా తన హయాంలో ప్రాజెక్టులకు పెద్దపీట వేశానని.. హసన్ - మైసూరు ప్రాజెక్టును కేవలం 13 నెలల్లో పూర్తిచేసినట్లు గుర్తుచేసుకున్నారు దేవెగౌడ. నిర్ణీత సమయంలో రెండు ప్రాజెక్టులు పూర్తిచేసిన ఘనత తనకుందని చెప్పుకొచ్చారు. అలాగే కశ్మీర్ రైల్వే, ఢిల్లీ మెట్రో రైల్ పథకాలకు తన హయాంలోనే నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. అంత చేసిన తనను ప్రధాని మోడీ విస్మరించడం సరికాదని వ్యాఖ్యానించారు. మోడీ గతం మరచిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

 21 ఏళ్లు.. నలుగురు ప్రధానులు

21 ఏళ్లు.. నలుగురు ప్రధానులు

బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన బోగీబీల్ వంతెన ప్రతిపాదనకు 1997 లోనే ఆమోదం లభించింది. అదే ఏడాది జనవరి 22న ప్రధానమంత్రి

హోదాలో హెచ్‌డి దేవెగౌడ శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం వాజ్‌పేయి హయాంలో 2002, ఏప్రిల్ లో ప్రారంభమయ్యాయి. యూరోపియన్‌ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లో నిర్మితమైన తొలి వంతెన ఇదే కావడం విశేషం. బ్రిడ్జి నిర్మాణానికి 21 ఏళ్లు పట్టింది. అంటే నలుగురు ప్రధానులు మారారన్నమాట. 120 సంవత్సరాల ఆయుష్షుగా చెబుతున్న ఈ ప్రాజెక్టు అంచనావ్యయం 5,900 కోట్ల రూపాయలు.

ఈ బ్రిడ్జిని దేశానికి అంకితం చేయడంతో అస్సాం, అరుణాచల్ మధ్య రాకపోకలు వేగవంతం కానున్నాయి. దేశభద్రతకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

అత్యవసర సమయాల్లో రక్షణ శాఖకు చెందిన యుద్ధ విమానాలు దిగడానికి కూడా అనుకూలంగా ఉండనుంది ఈ వంతెన.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Bogibeel Bridge, which was part of the Assam treaty, was approved in 1997. On January 22 of that year, the Prime Minister HD Devegowda laid the foundation stone. However, Deve Gowda alleges that the present Prime Minister Modi ignored him. Modi unlikely to invite him to the bridge opening ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more