• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ ‘మహా’ఎత్తుగడ:బీహార్ ఎన్నికల ఇంచార్జ్‌గా ఫడ్నవిస్ - సీట్ల పంపకంపై లొల్లి -ఎన్డీఏ, యూపీఏ ఇలా

|

గడిచిన మూడు నెలలుగా ప్రచారంలో ఉన్నట్లుగానే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 'మహారాష్ట్ర' ఎత్తుగడతోనే బరిలోకి దిగుతున్నది. బీహార్ కు చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో శివసేన కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయి విమర్శలు చేస్తోన్న బీజేపీ.. ఇప్పుడు బీహార్ ఎన్నికల ఇంచార్జిగా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను నియమించింది. శివసేనతో దోస్తీ చెడిన దరిమిలా.. బీహారీ వలస కూలీల పట్ల మరాఠా పార్టీలు అనుసరించే వైఖరి కూడా ఈ ఎన్నికల్లో ప్రధానాంశం కాబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు సీట్ల పంపకంపై ఎన్డీఏ, యూపీఏ కూటముల్లో అప్పుడే విభేదాలు తలెత్తాయి..

సీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగా

మహారాష్ట్ర వర్సెస్ బీహార్

మహారాష్ట్ర వర్సెస్ బీహార్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచార సారధిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం అధికారిక ప్రకటన చేశారు. 2015 ఎన్నికల్లో ఈ బాధ్యతను (దివంగత) అనంత కుమార్ నిర్వహించారు. గడిచిన మూడు నెలలుగా సుశాంత్ మృతి అంశంపై బీహార్, మహారాష్ట్ర అధికార పార్టీల మధ్య, ఉన్నతాధికారుల మధ్య తీవ్రస్థాయి వాగ్వాదాలు జరుగుతుండటం, సుశాంత్ మరణంలో శివసేన యువనేత, మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్య ఠాక్రే(సీఎం ఉద్ధవ్ తనయుడు) ప్రమేయం కూడా ఉందని బీజేపీ నేతలు ఆరోపించడం తెలిసిందే. బీహార్ లో కీలకంగా ఉన్న రాజ్ పుత్ వర్గీయుల ఓట్ల కోసమే సుశాంత్ మృతిని ఎన్డీఏ రాజకీయం చేస్తున్నదనే విమర్శలు కూడా లేకపోలేవు. బీహార్ ఎన్నికలకు ప్రచారాంశాలు కావాలంటే ముంబై నుంచి పార్సిల్ చేస్తామంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇటీవల వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈసారి బీహార్ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రధానాంశంగా మారినవేళ.. ఆ రాష్ట్రానికే చెందిన ఫడ్నవిస్ బీజేపీ ప్రచార సారధిగా నియమితులవ్వడం గమనార్హం. ఇకపోతే..

తీర్పుపై అద్వానీ అనూహ్య రియాక్షన్ - బీజేపీ నేత ఇంటి వద్ద భారీ హడావుడి - ఈ ఐదు పాయింట్లే కీలకం

సీట్ల పంపకంపై లొల్లి..

సీట్ల పంపకంపై లొల్లి..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ఆయా కూటములు సీట్ల పంపకంపై దృష్టిపెట్టాయి. బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాయకత్వంలోనే ఎన్డీఏ పోరాడుతుందని బీజేపీ హైకమాండ్ ప్రకటించగా.. స్థానిక నేతలు మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. ఈసారి జేడీయూతో సమానంగా బీజేపీకీ సీట్లు కేటాయించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ లో రెండు పార్టీలూ తలో 105 నుంచి 110 సీట్లలో పోటీ చేసి, మిగిలినవాటిని ఎన్డీఏ మిత్రులకు ఇవ్వాలని కాషాయ నేతలు కోరుతున్నారు. బీజేపీ, జేడీయూ కాకుండా ఎన్డీఏలో భాగస్వాములైన ఎల్జేపీ(పాశ్వాన్ పార్టీ), హెచ్ఎంఏ(జీతన్ రాం మాంఝీ పార్టీ)లు సైతం ఈసారి తమకు ఎక్కువ సీట్లు కావాలని పట్టుపడుతున్నారు. దీంతో..

  Bihar Elections 2020 ABP-CVoter Opinion Poll : Nitish-Led NDA To Sweep With 141- 161 Seats
  బీహార్‌పై ఢిల్లీలో కీలక చర్చలు

  బీహార్‌పై ఢిల్లీలో కీలక చర్చలు

  సీట్ల పంపకంపై బీజేపీ నేతలు రకరకాల డిమాండ్లు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా.. బీహార్ కు చెందిన ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించుకుని సమాలోచనలు జరుపుతున్నారు. డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, మంత్రి మంగల్ పాండే, బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ సహా పలువురు నేతలు ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీసులో నడ్డాతో భేటీ అయ్యారు. సీట్ల పంపకంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నడ్డా దిశానిర్దేశం చేశారు. అటు యూపీఏ సైతం సీట్ల షేరింగ్ పై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం తమ బీహార్ నేతల్ని ఢిల్లీకి పిలిపించుకుంది. బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మదన్ మోహన్ ఝా, సీఎల్పీ నేత సదానంద్ సింగ్ సహా కీలక నేతలు ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కీలక చర్చల్లో భాగం పంచుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు తమ మిత్రులైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై సమాలోచనలు చేయనున్నారు. 243 స్థానాలున్న బీహార్ లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 10న ఫలితాలు వెలువడతాయి.

  English summary
  Former Maharashtra CM and Bharatiya Janata Party leader Devendra Fadnavis appointed party's Bihar in-charge, ahead of Bihar Legislative Assembly elections. NDA and UPA parties holding key meetings over seat-sharing. BJP demands same number of seats as JD(U).
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X