వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా సీఎంగా ఫడ్నవీస్: ఎన్సీపీ వెన్నుపోటు.. నమ్మకద్రోహం.. కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాల్లో రాత్రికి రాత్రే పెనుమార్పులు చోటుచేసుకొన్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కలయికతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా అనుకుంటుండగానే.. శనివారం ఉదయమే అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఉదయమే ఫడ్నవీస్‌తో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్రంలో చోటుచేసుకొన్న అనూహ్య పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించింది. మహరాష్ట్ర కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ..

 మహారాష్ట్ర సీఎంపై శరద్ పవార్ పీటముడి.. డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరు! మహారాష్ట్ర సీఎంపై శరద్ పవార్ పీటముడి.. డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరు!

నమ్మక ద్రోహం చేసిందని

నమ్మక ద్రోహం చేసిందని

ఎన్సీపీ నమ్మక ద్రోహం చేసిందని ఘాటుగా కాంగ్రెస్ స్పందించింది. వెన్నుపోటు రాజకీయాలకు ఇది ప్రతీక అంటూ నేతలు ధ్వజమెత్తారు. నీతి మాలిన రాజకీయాలకు ఎన్సీపీ మరోసారి బాట వేసిందని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. అంతేకాకుండా బీజేపీతో ఎన్సీపీ జత కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడం శివసేన, కాంగ్రెస్‌కు దిమ్మతిరిగినట్లయింది.

జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్

జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్

శుక్రవారం రాత్రి వరకు సుదీర్ఘ చర్చల్లో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలకు ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ ఈ పరిణామం అయోమయంగా మారింది. ఈ పరిణామంపై అభిషేక్ బిత్తరపోయాడు. ఈ వార్త నిజమైతే పవార్ నువ్వ గ్రేట్ (తుస్సీ గ్రేట్ హో) అంటూ అభిషేక్ సెటైర్లు వేశాడు.

ఫేక్ న్యూస్ అయి ఉంటుందేమో..

ఫేక్ న్యూస్ అయి ఉంటుందేమో..

అభిషేక్ సింఘ్వీ ట్వీట్ చేస్తూ.. మహారాష్ట్రలో జరిగిన అనూహ్య పరిణామం నమ్మబుద్ది కావడం లేదు. ఇది ఫేక్ న్యూస్ అయి ఉంటుంది. మూడు రోజులుగా మహారాష్ట్ర అభివృద్ధికి కోసం ప్రభుత్వ ఏర్పాటు చేయాలని చర్చలు జరిగాయి. మా మధ్య కామన్ మినిమమ్ ప్రొగ్రాం కూడా రూపొందించడం జరిగింది. కానీ అవకాశవాదులు వేగంగా పావులు కదుపుతూ అవకాశాన్ని ఎగురేసుకుపోయారు. ఇది గమ్మత్తుగా అనిపిస్తున్నది. ఇదంతా నిజమా? ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు అంటూ అభిషేక్ సింఘ్వీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recommended Video

Devendra Fadnavis Takes Oath As Maharashtra CM || డిప్యూటీగా అజిత్ పవార్

శనివారం ఉదయమే అనూహ్య పరిణామం

శుక్రవారం రాత్రి వరకు ఉద్దవ్ థాకరే సీఎంగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, కాంగ్రెస్ నుంచి బాలా సాహెబ్ థోరట్ డిప్యూటీ సీఎం పోస్టును చేపట్టే అవకాశాలున్నాయనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. శనివారం ఉదయం ఈ మూడు పార్టీల నేతలు మీడియాతో సమావేశమై సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేస్తారనే విషయం మీడియాలో కనిపించింది. అయితే రాత్రికి రాత్రే పావులు కదిపి అధికారం దక్కించుకోవడం బీజేపీ రాజకీయ చతురత మరోసారి స్పష్టమైంది.

English summary
Devendra Fadnavis, Maharashtra: Congress party termed this mega-development as "backstabbing" by the NCP. Surreal wht I read abt #Maharashtra. Thought it was fake news. Candidly &personally speaking, our tripartite negotiations shd not have gone on for more than 3 days...took too long. Window given was grabbed by fast movers. #pawarji tussi grt ho! Amazing if true, still not sure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X