వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల్‌థాకరేకు ఫడ్నవీస్ నివాళి: స్పూర్తి ప్రదాత అని పొడగ్తలు, పొత్తు పొడవకున్నా..

|
Google Oneindia TeluguNews

శివసేన చీఫ్, దివంగత బాల్‌థాకరే వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు. బాలాసాహెబ్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. బాల్ థాకరే తమకు స్పూర్తి ప్రదాత అని పొగడ్తల వర్షం కురిపించారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి బెడిసికొట్టడం.. అధికారానికి బీజేపీ 40 సీట్ల దూరంలో నిలిచిన క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ బాల్‌థాకరే పొగడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రేరణ..

ప్రేరణ..

తమ ప్రేరణ బాల్‌థాకరే అని ఫడ్నవీస్ కీర్తించారు. ఈ మేరకు వీడియోను ట్వీట్ చేశారు. థాకరే ఆత్మభిమానం వ్యాఖ్యలు మహారాష్ట్రీయులు సర్వదా గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. వందలాది మంది బాల్ థాకరేకు అభిమానులు సెల్యూట్ చేస్తారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేనతో బీజేపీ పొత్తు పేటాకులైన ఫడ్నవీస్ బాల్ థాకరేను కొనియాడటం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

పొగడ్తలు

పొగడ్తలు

థాకరే సమాధి వద్ద ఉద్దవ్ థాకరే, ఇతరులు తమ సత్తా చాటే ప్రయత్నం చేయగా.. ఫడ్నవీస్, నితిన్ గడ్కరీ బాల్ థాకరేను పొగడ్తలతో ముంచెత్తి చర్చకు దారతీశారు. థాకరేను ఫడ్నవీస్‌తోపాటు నితిన్ గడ్కరీ కూడా కొనియాడారు.

కూటమి నుంచి ఔట్..?

కూటమి నుంచి ఔట్..?

ఎన్డీఏ పక్షాల భేటీకి శివసేన డుమ్మా కొట్టింది. తాము కూటమి నుంచి బయటకు వచ్చినట్టేనని స్పష్టంచేసింది. దానిని అధికారికంగా ధ్రువీకరించడమే మిగిలి ఉంది అని పేర్కొన్నది. మరోవైపు ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది.

కోర్ కమిటీలో చర్చ

కోర్ కమిటీలో చర్చ

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆ పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఆదివారం ఎన్సీపీ కోర్ కమిటీ చర్చ జరుగుతుంది. అందుకోసమే సాయంత్రం సోనియాతో శరద్ పవార్ భేటీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీనిని ఎన్సీపీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.

 మెజార్టీ ముందు..

మెజార్టీ ముందు..

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 145 సభ్యుల మద్దతు తప్పనిసరి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ అధికారానికి 40 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో తమ భాగస్వామ్య పక్షం శివసేన 50-50 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది.

బీజేపీ నో

బీజేపీ నో

బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమైంది. ఈ లోపు గవర్నర్ శివసేన, ఎన్సీపీలకు కూడా అవకాశం ఇచ్చారు. కానీ వారు బలం నిరూపించుకోకపోవడంతో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ప్రెసిడెంట్ రూల్ అమలు చేస్తున్నారు.

English summary
Former Maharashtra chief minister Devendra Fadnavis on Sunday praised Shiv Sena founder Bal Thackeray and called him a source of inspiration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X