వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా ట్విస్ట్: సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీగా అజిత్ పవార్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Devendra Fadnavis Takes Oath As Maharashtra CM || డిప్యూటీగా అజిత్ పవార్

మహారాష్ట్ర రాజకీయ తెరపై మరో ట్విస్ట్. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేసినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. శివసేన కూటమి అధికారం చేపడతుందనుకునే దశలో.. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేసి విపక్షాలకు షాకిచ్చారు. దీంతో శివసేనకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయిపోయింది.

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..? ఉద్దవ్ థాకరే వైపు మొగ్గు.. ఆదిత్య ఎందుకు వద్దంటే..?మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..? ఉద్దవ్ థాకరే వైపు మొగ్గు.. ఆదిత్య ఎందుకు వద్దంటే..?

వాస్తవానికి ఇవాళ శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి గవర్నర్‌ను కలువాల్సి ఉంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఆహ్వానించాల్సిందిగా కోరతారు. కానీ ఇంతలో ఫడ్నవీస్ సీఎంగా పదవీ చేపట్టారు. డిప్యూటీగా అజిత్ పవార్ బాధ్యతలు స్వీకరించడంతో.. బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇచ్చినట్టు అర్థమవుతుంది. అంటే శివసేనకు సపోర్ట్ చేస్తామని చెబుతూనే.. బీజేపీ కూటమిలో ఎన్సీపీ చేరిపోయింది. అయితే విపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం అంటిముట్టనట్టుగానే వ్యవహరించినట్టు తెలుస్తోంది.

Devendra Fadnavis sworn in as Maharashtra CM, Ajit Pawar Dy CM

శుక్రవారం వరకు మహారాష్ట్రలో శివసేన కూటమి అధికారం చేపట్టబోతుందని వార్తలు గుప్పుమన్నాయి. ఉద్దవ్ థాకరే సీఎం పదవీ చేపట్టడం ఖాయమైపోయింది. కనీస ఉమ్మడి ప్రణాళిక కూడా కొలిక్కి వచ్చింది. శివసేనకు సీఎం పదవీ ఇవ్వనుండగా... కాంగ్రెస్-ఎన్సీపీ స్పీకర్ పోస్ట్ కోసం పోటీపడ్డాయి. మంత్రి పదవులు మాత్రం సమానంగానే పంచుకుంటామని ప్రకటించాయి. కానీ దేవేంద్ర ఫడ్రవీస్ ప్రమాణ స్వీకారంతో వారి కలలు కల్లలుగానే మిగిలిపోయాయి.

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేశారో లేదో వెంటనే ప్రధాని మోడీ స్పందించారు. కొన్ని క్షణాల్లోనే ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఫడ్నవీస్, పవార్ కలిసి బాగా పనిచేస్తారనా విశ్వసిస్తున్నా అని పేర్కొన్నారు. దీంతో మహారాష్ట్ర అన్ని విభాగాల్లో అభివృద్ధి సాధిస్తోందని విశ్వసిస్తోన్నా అని తెలిపారు.

English summary
Devendra Fadnavis was sworn in on Saturday morning as the chief minister of Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X