వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సీఎం దేవేంద్రుడు ?: ఇద్దరు డీసీఎంలు, కీలక పదవులు మాకే, శివసేన ఓకే!

|
Google Oneindia TeluguNews

ముంబై: కొన్ని రోజులుగా దేశ రాజకీయాలకు ఉత్కంఠకు గురి చేస్తున్న మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి బీజేపీ, శివసేన పార్టీల చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని వెలుగు చూసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ (దేవేంద్రుడు) ను కొనసాగించాలని, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ, శివసేన పార్టీల నాయకులు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ 5 ఏళ్ల పూర్తి కాలం కొనసాగుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

మోస్ట్ వాంటెడ్ బాగ్దాదీని ఎలా అంతం చేశారంటే, ఫోటో, వీడియో వైరల్, ఓ లుక్కేయండి!మోస్ట్ వాంటెడ్ బాగ్దాదీని ఎలా అంతం చేశారంటే, ఫోటో, వీడియో వైరల్, ఓ లుక్కేయండి!

వారం పంచాయితి

వారం పంచాయితి

అక్టోబర్ 24వ తేదీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అందులో ఎలాంటి సమస్య ఉండదని అందరూ భావించారు. అయితే ముఖ్యమంత్రిని నియమించే విషయంలో బీజేపీ, శివసేనల మధ్య పంచాయితీ మొదలైయ్యింది.

50.50 ఫార్ములా

50.50 ఫార్ములా

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నియమించే విషయంలో తాము ముందుగా చెప్పినట్లు 50.50 ఫార్ములాకు కట్టుబడి ఉన్నామని, అందులో ఎలాంటి మార్పు ఉండదని శివసేన కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. శివసేన కొత్త ఫార్ములాతో బీజేపీకి కొత్త తలనొప్పి మొదలైయ్యింది.

మిత్రపక్షం డిమాండ్ తో చిక్కులు

మిత్రపక్షం డిమాండ్ తో చిక్కులు

శివసేన డిమాండ్లతో బీజేపీ అయోమయంలో పడిపోయింది. మిత్రపక్షం నాయకుల తీరుతో బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ముంబై వెళ్లి చర్చలు జరిపారు. చివరికి శివసేన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రభుత్వంలో కీలమైన మంత్రి పదవులు తీసుకోవడానికి అంగీకరించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రతిపక్షాలకు చెక్ !

ప్రతిపక్షాలకు చెక్ !

బీజేపీ, శివసేన చర్చలు ఫలించడంతో ఇంత కాలం ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పిన ప్రతిపక్షాలు ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యాయి. ఎన్సీపీ శాసన సభాపక్ష నాయకుడిగా అజిత్ పవార్ ఎన్నిక అయ్యారు. తాము ప్రతిపక్షంలోనే ఉంటామని, బీజేపీ-శివసేన మధ్యలో జోక్యం చేసుకోమని అజిత్ పవార్ అన్నారు. మొత్తం మీద మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి కొన్ని అడ్డంకులు తెలగిపోవడంతో బీజేపీ వర్గాలు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాయి.

English summary
Maharshtra Assembly Elections 2019: Devendra Fadnavis To Be CM, 2 Deputies, Sources Said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X