• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ వ్యక్తి తలపై పెరిగిన కొమ్ము.. వైద్య చరిత్రలో అరుదైన ఘటన

|

మధ్యప్రదేశ్: ఒకరి తల మరొకరి తలను ఢీకొంటే అమ్మో కొమ్ములొస్తాయని చెప్పి మళ్లీ తలను రెండో సారి ఢీకొంటారు. ఇలాంటి సీన్ బొమ్మరిల్లు సినిమాలో కూడా కనిపిస్తుంది. సినిమా సంగతి అటుంచితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పెద్దాయనకు మాత్రం నిజంగా తలనుంచి ఓ కొమ్ము పెరుగుతోంది. ఈ వ్యక్తిని చాలామంది వింతగా చూస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఏమా కథా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తలపై పెరిగిన కొమ్ము

తలపై పెరిగిన కొమ్ము

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఉన్న రాహ్లీ గ్రామానికి చెందిన శ్యాంలాల్ యాదవ్ అనే వ్యక్తికి తలపై కొమ్ము వచ్చింది. గత కొన్నేళ్లుగా తన తలపై ఈ కొమ్ము ఉండేదని తీయించుకునేందుకు హాస్పిటల్‌కు వెళ్లగా అసలు విషయం వెలుగు చూసింది. కొన్నేళ్ల కిందట తన తలకు బలమైన గాయం అయ్యిందని అప్పటి నుంచే తన శరీరంపై ఈ కొమ్ము పెరుగుతూ వస్తోందని శ్యాంలాల్ యాదవ్ చెప్పాడు. కాలక్రమంలో ఆ కొమ్ము మరింత పెద్దదిగా మారిందని చెప్పారు. ముందుగా కొంత వింతగా అనిపించినప్పటికీ ఆ తర్వాత దానికి అలవాటు పడిపోయాడు శ్యాంలాల్. ఇక పెరుగుతుండటంతో ఎప్పటికప్పుడు చిన్నగా దాన్ని కట్ చేయడం మొదలు పెట్టాడు.

డెవిల్ హార్న్‌తో బాధపడిన శ్యాంలాల్

డెవిల్ హార్న్‌తో బాధపడిన శ్యాంలాల్

గోర్లు కత్తిరిస్తే మళ్లీ ఎలాగైతే పెరుగతాయో శ్యాంలాల్ తలపై కొమ్ము కూడా అలానే పెరగసాగింది. ఇలా కాదని చెప్పి హాస్పిటల్‌కు వెళ్లి వైద్యులకు చూపించాడు. అయితే వారు కూడా ఈ వింత రోగానికి పరిష్కారం కనుగొనలేదు. ఇక చివరిగా సాగర్ లోని భాగ్యోదయ్ తీర్థ్ హాస్పిటల్‌లో పెరుగుతున్న ఈ కొమ్మును సర్జరీ ద్వారా తీయించుకున్నాడు. శ్యాంలాల్ సెబేసియస్ హార్న్ అనే దాంతో బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు.ఇది సాధారణంగా సూర్యకిరణాల ఎక్కువగా చర్మంను తాకితే వస్తుందని చెప్పారు. దీన్నే డెవిల్స్ హార్న్ అని కూడా పిలుస్తామని చెప్పారు.

  కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష విజయవంతం || DRDO Successfully Tests Indigenous Anti-Tank Missile
  ఈ తరహా కేసులు చాలా అరుదు: డాక్టర్ విశాల్

  ఈ తరహా కేసులు చాలా అరుదు: డాక్టర్ విశాల్

  ఆపరేషన్ ద్వారా ఈ కొమ్మును తొలగించామని డాక్టర్ విశాల్ గాజ్‌బియే చెప్పారు. ముందుగా ఎక్స్‌రే తీశామని అయితే ఆ కొమ్ము మూలాలు చాలా లోపల లేకపోవడంతో సర్జరీ కాస్త సులభంగా చేయగలిగామని డాక్టర్ విశాల్ తెలిపారు. ఈ తరహా కేసులు చాలా అరుదని ఈ సర్జరీకి సంబంధించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురించేందుకు పంపిస్తామని డాక్టర్ విశాల్ తెలిపారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A 74-year-old man in Madhya Pradesh suffered from a rare condition which made a horn-like mound form on his head several years ago. Shyam Lal Yadav, is a resident of Rahli village in Sagar district in Madhya Pradesh, recently went through an operation to have the mound removed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more