వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల భక్తులు అర్బన్ నక్సల్స్ : కేంద్రమంత్రి మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి మహిళల ప్రవేశంపై విస్తృత స్థాయి ధర్మాసనంకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా శబరిమలకు వెళుతున్న భక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్. శబరిమలకు వెళుతున్న భక్తులను అర్బన్ నక్సల్స్‌గా పేర్కొన్నారు. వారంతా అరాచకవాదులని నాస్తికులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి మురళీధరన్. వాళ్లు నిజమైన భక్తులా కాదా అని తెలియాలంటే కొండపైకి వచ్చే వారిని విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

మహిళలకు ఎంట్రీ ఉందా లేదా : భక్తుల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయ ద్వారాలుమహిళలకు ఎంట్రీ ఉందా లేదా : భక్తుల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయ ద్వారాలు

భక్తితో వెళ్లడం లేదు..పేరకు మాత్రమే వెళుతున్నారు

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నామని చెప్పుకునేందుకే భక్తుల పేరుతో ఆలయంకు వెళుతున్నారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి మురళీధరన్. వారు నిజంగా భక్తితో అక్కడికి వెళ్లడం లేదని అభిప్రాయపడిన ఆయన.. వారంతా పేరుకు మాత్రమే వెళుతున్నారని చెప్పారు. నిజమైన భక్తులు కాదో లేదో తెలియాలంటే వారిని విచారణ చేయాలని చెప్పారు. భక్తుల కోసం శబరిమల ఆలయద్వారాలు శనివారం తెరుచుకున్న నేపథ్యంలో మంత్రి మురళీధరన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైయ్యాయి.

విస్తృత స్థాయి ధర్మాసనంకు రివ్యూ పిటిషన్ బదిలీ

విస్తృత స్థాయి ధర్మాసనంకు రివ్యూ పిటిషన్ బదిలీ

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలు ప్రవేశించొచ్చు అన్న 2018 సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దాన్ని విస్తృత స్థాయి ధర్మాసనంకు బదిలీ చేస్తున్నట్లు అప్పటి తాజా మాజీ చీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్ తీర్పుచెప్పారు. అయితే 2018నాటి సుప్రీంకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోవడంతో మహిళలు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన 10 మంది మహిళలను పంబ ప్రాంతం వద్ద అడ్డుకుని వెనక్కు పంపారు. వారంతా 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యవయస్సులో ఉన్నవారు కావడం విశేషం.

 భద్రత కల్పించలేమన్న కేరళ సర్కార్

భద్రత కల్పించలేమన్న కేరళ సర్కార్

ఇదిలా ఉంటే గతేడాది స్వామి దర్శనానికి వచ్చిన కొంతమంది మహిళా భక్తులకు కేరళ ప్రభుత్వం భద్రత కల్పించింది. కానీ ఈ సారి మాత్రం భద్రత కల్పించేది లేదంటూ తెగేసి చెప్పేసింది. శనివారం ఉదయం 3 గంటలకు ఆలయద్వారాలు తెరిచారు ఆలయ ప్రధాన అర్చకులు ఏకే సుధీర్ నంబూత్రి. నెయ్యాభిషేకం జరిగిన వెంటనే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయంకు చేరుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తులు దాన్నేమీ లెక్కచేయకుండా సన్నిధానంకు హాజరయ్యారు.

English summary
Minister of State for External Affairs V Muraleedharan on Sunday said that the devotees visiting Sabarimala temple are "urban naxals, anarchists and atheists".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X