• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దీన్ని నది అంటారా?..హస్తిన కకావికలం: గాలి తోడు నీరు: విషం చిమ్ముతోన్న యమున..!

|

న్యూఢిల్లీ: అగ్నికి వాయువు తోడైందనేది సామెత. దీన్ని తిరగ రాసుకోవాల్సి వస్తోంది దేశ రాజధాని విషయంలో. గాలికి నీరు తోడైంది. వాయు కాలుష్యంతో కకావికలమైన ఢిల్లీ జనాలకు కొత్తగా నీటి కాలుష్యం భయ పెడుతోంది. న్యూఢిల్లీ గుండా ప్రవహించే యమునా నది కాలుష్య కాసారమైంది. విషాన్ని విరజిమ్ముతోంది. నదిలో కలిసిన రసాయనాలు నురగలుగా తేలుతున్నాయి. నదిలో నీరు కూడా కనిపించనంత మందంగా రసాయన నురగలు అలముకున్నాయి. నది మొత్తాన్ని ఆక్రమించేశాయి. విషతుల్యమైన నదీ జలాల్లోనే ఢిల్లీ వాసులు ఛాత్ పూజలను నిర్వహిస్తున్నారు.

ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి..

ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి..

రెండు రోజులుగా యమునానదిలో ఇదే పరిస్థితి నెలకొని ఉంటోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న హస్తిన ప్రజలు నీటి కాలుష్యం సైత తోడు కావడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. యమునా నది పరీవాహక ప్రాంతం మొత్తం ఇదే దుస్థితిలో కనిపిస్తోంది. ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో నివసిస్తోన్న చాలామంది క్రమంగా తట్టా బుట్టా సర్దుకునే పరిస్థితి కనిపిస్తోంది. జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వలస వెళ్లిన కార్మికులు, చిరు వ్యాపారులు తమ సొంత రాష్ట్రాలకు ప్రయాణమౌతున్నారు.

కేంద్రమంత్రుల ఉవాచ: ఈమని శంకర శాస్త్రి వీణానాదాన్ని వినండి..క్యారెట్లను దండిగా తినండి!

 జనం.. తిరుగుముఖం..

జనం.. తిరుగుముఖం..

పాఠశాలలకు వరుసగా సెలవులను ప్రకటించిన నేపథ్యంలో.. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పంజాబ్, హర్యానా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వలస వెళ్లిన ప్రజలు తిరుగుముఖం పడుతున్నారు. కాలుష్యం తగ్గేంత వరకూ మళ్లీ ఢిల్లీకి వెళ్లడానికి ఇష్ట పడట్లేదు. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో నివసించే ప్రజల్లో సుమారు 40 శాతానికి పైగా తమ సొంత రాష్ట్రాలకు బయలుదేరడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఢిల్లీలో వాయు కాలుష్యం నెలకొంది. రోజుల తరబడి ఇదే పరిస్థితి. తేలికపాటి జల్లులు పడటంతో కాలుష్యం మరింత పెరిగింది.

సరి, బేసి విధానం అమలు

సరి, బేసి విధానం అమలు

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నుంచి సరి, బేసి విధానాన్ని మరోసారి ప్రవేశపెట్టింది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ విధానం కొనసాగుతుంది. తమ వాహనాల చివరన సరి అంకె ఉన్న వారు సోమవారం వాహనాలను బయటికి తీయవచ్చు. ఈ ఉదయం 8 గంటలకు ఈ విధానం అమల్లోకి వచ్చింది. దీన్ని ఉల్లంఘించిన వారిపై భారీగా పెనాల్టీలను విధించింది కేజ్రీవాల్ సర్కార్. సరి, బేసి విధానాన్ని ఉల్లంఘించిన వాహనాలను రోడ్ల మీదికి తీసుకొచ్చిన వారికి 20 వేల జరిమానా విధించాలని ఆదేశించింది. ఈ విధానాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి ప్రత్యేకంగా 200 మంది ట్రాఫిక్ పోలీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 కాలుష్య జలాల్లోనే ఛాత్ పూజ

కాలుష్య జలాల్లోనే ఛాత్ పూజ

ఉత్తరాది వారికి అత్యంత ప్రధానమైన పండుగల్లో ఒకటి ఛాత్ పూజ. నదీమ తల్లిని పూజించుకోవడం దీని ప్రత్యేకత. కార్తికమాసం కావడంతో నదీ జలాల్లో స్నానం చేసి, ఛాత్ పూజను నిర్వహించడం ఆనవాయితీ. విషాన్ని చిమ్ముతున్నప్పటికీ.. భక్తులు పెద్ద సంఖ్యలో యమునా నదిలో స్నానం చేసి, ఛాత్ పూజలను నిర్వహించారు. ప్రత్యామ్నాయమేదీ లేకపోవడం వల్లే యమునా నది మీదే ఆధారపడాల్సి వస్తోందని భక్తులు చెబుతున్నారు. ఛాత్ పూజ కోసం ఢిల్లీ ప్రభుత్వం 19 ఘాట్లను నిర్వహించింది. అక్కడ ఘాట్లు కనిపించట్లేదు గానీ.. రసాయనాల మిశ్రమం వల్ల ఏర్పడిన నురగలు విస్తారంగా దర్శనమిస్తున్నాయి.

English summary
On a day Delhi saw its air quality dip to a three-year low, thousands of devotees offered prayers along the banks of the Yamuna river to mark the end of Chhath Puja. Early Sunday morning, men in dhoti and women in saree stepped into the river water with toxic, white foam floating on the surface of the polluted water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X