వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మౌని అమావాస్య ఎఫెక్ట్.. కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులు

|
Google Oneindia TeluguNews

లక్నో : ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు, దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. పవిత్రస్నానాలు ఆచరించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో సోమవారం నాడు మౌని అమావాస్య కావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. మౌని అమావాస్య రోజు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాదిగా తరలివచ్చారు. కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారనేది భక్తులు ప్రగాఢ విశ్వాసం. ముక్కోటి దేవతలను స్మరించుకుంటూ గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

Devotees take holy dip in river Ganga on Mauni Amavasya

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంకగాంధీ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. అయితే కుంభమేళాలో రెండవ షాహి స్నాన్ గా పిలిచే మౌని అమావాస్య (ఫిబ్రవరి 4) రోజున సోదరుడు రాహుల్ తో కలిసి ఆమె పవిత్ర స్నానం ఆచరించనున్నారు. అది కుదరనిపక్షంలో మూడవ షాహి స్నాన్ గా పిలిచే బసంత పంచమి (ఫిబ్రవరి 10) రోజున పుణ్యస్నానం ఆచరించి.. అదే రోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ కనిపిస్తోంది.

English summary
Devotees qued for prayagraj kumbh mela across the country. Taking holy dip in river Ganga on Mauni Amavasya. Priyanka Gandhi may also came to kumbh mela on this day to take holy dip.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X