వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీటెక్కించిన దేవయాని ముంబైలో నవ్వుతూ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దౌత్యకారిణి దేవయాని కుటుంబ సభ్యులు ఫిబ్రవరి నెల తర్వాత భారత్‌కు తిరిగి వస్తారని దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగేడ్ చెప్పారు. దేవయానిని అవమానకర రీతిలో అరెస్టు చేసి దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం తీవ్ర దుమారం రేపడమే కాకుండా అమెరికా - భారత్‌ల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

దేవయాని ఇటీవలే భారత్‌కు వచ్చారు. ఆమె తిరిగి అమెరికాలో కాలుమోపితే అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కడి అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో దేవయాని మూడు రోజుల క్రితం తన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. తాను అమెరికాలో ఉన్న తన కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకోవడం అనుమానంగానే ఉందని ఆమె ఆవేదనగా చెప్పారు.

దేవయాని భర్త ఆకాష్ అమెరికా సిటిజన్. వారికి ఏడేళ్ల, నాలుగేళ్ల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిని తాను కలుస్తానో లేదోనని దేవయాని బాధపడింది. అయితే దేవయాని తండ్రి మంగళవారం మాట్లాడుతూ.. ఆకాశ్, పిల్లలు ఫిబ్రవలి తర్వాత భారత్‌కు వస్తారని చెప్పారు.

దేవయాని 1

దేవయాని 1

దేవయాని మంగళవారం ముంబై వచ్చారు. ఆమె తల్లిదండ్రులు అందేరీలోని వెర్సోరాలో ఉంటున్నారు. దీంతో ఆమె నిన్న మహారాష్ట్ర రాజధాని ముంబైకి వచ్చారు.

దేవయాని 2

దేవయాని 2

ఈ సందర్భంగా దేవయాని తండ్రి మాట్లాడుతూ.. దేవయాని మరో వారం రోజుల్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్తారని చెప్పారు. ఢిల్లీలో ఆమెకు కొంతకాలం పోస్టింగ్ ఇచ్చే అవకాశముందన్నారు.

దేవయాని 3

దేవయాని 3

అమెరికా ఘటనపై స్పందిస్తూ... తన కూతురు దేవయానిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, దీనికి సంబంధించి ఆమె ఎలాంటి జరిమానా చెల్లించడం లేదా వెనక్కి తగ్గడం ఉండదని చెప్పారు.

దేవయాని 4

దేవయాని 4

తమ కూతురు దేవయాని పైన అమెరికా పెట్టిన కేసులను ఉపసంహరింప చేసేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే విశ్వాసం ఉందని ఉత్తమ్ చెప్పారు.

దేవయాని 5

దేవయాని 5

ఆదర్శ్ కుంభకోణం అంశపై స్పందిస్తూ.. జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని, వాటి గురించి తాము పట్టించుకోమని చెప్పారు. సంచలనం రేపిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో దేవయానికి ఫ్లాట్ ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దేవయాని 6

దేవయాని 6

భారత దౌత్యకారిణి దేవయాని కుటుంబ సభ్యులు ఫిబ్రవరి నెల తర్వాత భారత్‌కు తిరిగి వస్తారని దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగేడ్ చెప్పారు.

దేవయాని 7

దేవయాని 7

దేవయానిని అవమానకర రీతిలో అరెస్టు చేసి దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం తీవ్ర దుమారం రేపడమే కాకుండా అమెరికా - భారత్‌ల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

English summary
Devyani Khobragade's family will relocate to India, said her father retired bureaucrat Uttam Khobragade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X