వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైజాక్‌కు, ఎమర్జెన్సికి తేడా తెలియని పైలట్...! చివరికి ఏమయ్యాడు...?

|
Google Oneindia TeluguNews

విమానాలను నడపడానికి చాలా శిక్షణ అవరసరం.. శిక్షణతో పాటు సమయానకూలంగా కూడ వ్యవహరించాల్సిన అవసరం కూడ ఉంటుంది. ఫ్లైట్‌లో ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా... వందలాదీ మంది ప్రాణాలు గాల్లోనే కలిసి పోయో ప్రమాదం ఉంటుంది. అందుకే పైలట్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే పైలట్ వృత్తికి అమితమైన గౌరవం కూడ ఉంటుంది. అయితే ఇంత పెద్ద భాద్యతలో ఉన్న పైలట్ మాత్రం నిర్లక్ష్యంగా వ్వవహరించాడు. ఓ సమాచారానికి బదులు మరో సమాచారాన్ని ఇచ్చాడు.

జూన్ తోమ్మిదిన ఢిల్లి నుండి కశ్మీర్‌కు వెళుతున్న ఎయిర్ ఎషియా విమానంలో ఓ ఇంజిన్ ఆగిపోయింది. దీంతో ఎమర్జెన్సిగా ఫ్లైట్ దిగాల్సిన అవసరమున్న నేపథ్యంలో... ఇదే విషయాన్ని పైలట్ ఏటీఎస్‌కు కోడ్ ద్వార సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పైలట్ మాత్రం ఎమర్జెన్సి కోడ్‌కు బదులు విమానం హైజాక్‌కు సంబంధించిన కోడ్‌ను ఏటిఎస్‌కు పంపాడు. దీంతో కాసేపు విమానాశ్రయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకోంది.

 DGCA suspended an AirAsia India pilot for a period of three months

ఇక అసలు విషయం తెలుసుకున్న ఏటిఎస్ అధికారులు అనంతరం ఊపిరిపీల్చుకున్నారు. అయితే తప్పుడు సమాచారం పంపి ఆందోళనకు గురి చేసిన పైలట్‌కు డీజీసీఏ నోటిసులు జారీ చేసింది. దీంతో పైలట్ ఇచ్చిన సమాధానం అధికారులకు సంతృప్తి కరంగా లేకపోవడంతో పైలట్‌పై వేటు వేశారు. మూడు నెలల పాటు విధులకు దూరంగా ఉండే విధంగా సస్పెండ్ చేశారు.

English summary
aviation regulator DGCA suspended an AirAsia India pilot for a period of three months for erroneously transmitting the 'hijack code' to the Air Traffic Services during a Delhi-Srinagar flight on June 9, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X