వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరీ అరెస్ట్, ఒకరు ఆటో డ్రైవర్: ధాన్‌బాద్ మేజిస్ట్రేట్ మృతి కేసులో పురోగతి

|
Google Oneindia TeluguNews

ధాన్‌బాద్ జడ్జీ ఉత్తమ్ ఆనంద్ మృతి కేసులులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు ఆటో డ్రైవర్ ఉన్నారు. ధాన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జీ ఉత్తమ్ ఆనంద్.. బుధవారం ఉదయం ఆటో ఢీ కొనడంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఉదయం పూట జాగింగ్ చేస్తోన్న సమయంలో ఆగంతకులు మాటు వేసి హత్య చేశారు.

బుధవారం ఉదయం ఉత్తమ్ ఆనంద్ జాగింగ్‌కు వెళ్లారు. అతనిని ఫాలొ అవుతున్న దుండగులు.. ప్రణాళిక ప్రకారం ఆటోతో ఢీ కొన్నారు. అతని అధికార నివాసానికి 500 మీటర్ల దూరంలో ఘటన జరిగింది. తర్వాత కొందరు ఉత్తమ్ ఆనంద్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే సమీపంలో గల ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తీవ్ర గాయాలతో ఉత్తమ్ ఆనంద్ చనిపోయారు.

Dhanbad judge killing: two, including auto driver, held

ఉత్తమ్ ఆనంద్.. రెండు హై ప్రొఫైల్ మర్డర్ కేసులు, అక్రమంగా కోల్ మైన్ రవాణాకు సంబంధించి విచారణ కేసులు వచ్చాయి. ఆ కేసులకు సంబంధించిన వారు దాడి చేయించి ఉండొచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి. తొలుత ఉత్తమ్ ఆనంద్ ఘటనను హిట్ అండ్ రన్ అనుకున్నారు. కానీ తర్వాత సీసీటీవీ ఫుటేజీ చూడగా.. పథకం ప్రకారం ఢీ కొట్టి వెళ్లిపోయారని నిర్ధారణకు వచ్చారు. ఆటో రిక్షా సడెన్‌గా ఎడమ వైపునకు తిప్పారు. జడ్జీని ఢీ కొని వెళ్లిపోయింది. ఉత్తమ్ ఆనంద్ మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత హజారీబాగ్ జిల్లాలో గల అతని స్వస్థలానికి పంపించారు.

Recommended Video

#TOPNEWS: Low Pressure Over North Bay Of Bengal | Oneindia Telugu

ఉత్తమ్ ఆనంద్ మృతికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. ధాన్ బాద్ ఎస్పీ రామ్ కుమార్ నేతృత్వంలో కేసు విచారణ జరగనుంది. అయితే ఆ ఆటోను చోరీ చేసి మరీ ఢీ కొట్టారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆటో ఎవరిదీ.. ఎవరు హత్య చేయించారని కోణంలో సిట్ దర్యాప్తు జరుపుతుంది. జడ్జీని హతమార్చడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా తీసుకుంది. కారకులను వదిలిపెట్టొద్దు అని స్పష్టంచేసింది. దీనిపై ఇప్పటికే సిట్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

English summary
Jharkhand police on Thursday arrested two persons, including the driver of the autorickshaw that “deliberately” knocked down fatally Uttam Anand, Additional Sessions Judge of Dhanbad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X