వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలప్రళయం: ఒక్కసారిగా ధౌలిగంగాలో పెరిగిన నీటి మట్టం, భారీ నష్టం

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జోషి మఠ్ వద్ద ధౌలి గంగా నది గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో నీటి మట్టం పెరిగిందని కేంద్ర నీటి కమిషన్ అధికారులు తెలిపారు. ధౌలి గంగా, అలకనంద నదులకు భారీగా వరదరావడంతో ఛమోలి జిల్లాలో పెనుప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో 150 మందికిపైగా అక్కడే ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులు గల్లంతయ్యారు.

2013లో హిమానీనదాలు విరిగిపడటంతో కేదార్నాథ్‌లో పెను వరదలు సంభవించిన విషయ తెలిసిందే. కాగా, ఆదివారం ఉదయం 11 గంటలకు జోషిమఠ్ వద్ద నీటి మట్టం 1388ఎం ఉందని, సెంట్రల్ వాటర్ కమిషన్ ఛైర్మన్ సౌమిత్రా హల్దార్ తెలిపారు. 2013 వరదల సమయంలో ఈ ప్రాంతంలో 1385.54మీటర్లు ఉందని తెలిపారు.

అయితే, ఆదివారం రాత్రి 6గంటల ప్రాంతంలో నీటి మట్టం సాధారణ స్థితికి వచ్చిందని సెంట్రల్ వాటర్ కమిషన్(అప్పర్ అండ్ మిడిల్ గంగా డివిజన్) సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజేష్ కుమార్ తెలిపారు. నీటి మట్టం తగ్గడం ప్రారంభించిందని తెలిపారు.

జోషిమఠ్ వద్ద శనివారం 1372.58ఎం ఉండగా, వరదల అనంతరం ఆదివారం సాయంత్రం 6గంటలకు 1375మీ ఉందని తెలిపారు. నంద్‌ప్రయాగ్‌లో, నది దిగువ భాగంలో, నీటి మట్టం సాయంత్రం 6 గంటలకు. 840.40 మీ. ఒక రోజు ముందు, మధ్యాహ్నం 1 గంటలకు 848.30 మీ. గా ఉంది. కాగా, రుద్రప్రయాగ్, శ్రీనగర్, దేవ్‌ప్రయాగ్, రిషికేశ్, దేవ్‌ప్రయాగ్‌లలో పరిస్థితి ఇలాగే ఉందని కుమార్ అన్నారు.

 Dhauliganga’s water level at Joshimath breaches records, say Central Water Commission

శ్రీనగర్ జలవిద్యుత్ ప్రాజెక్టులోని నీటి మట్టం మీన్ డ్రా డౌన్ స్థాయిలో ఉంది, ఇది ఎగువ విస్తీర్ణాల నుంచి అదనపు ప్రవాహాన్ని కల్పించడంలో సహాయపడిందని, ఇది నెమ్మదిగా విడుదల అవుతుందన్నారు.

ధౌలిగంగా, రిషిగంగా, అలకనంద నదులలో రోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. గంగా నది అనుబంధ ఉపనదులు - ఎత్తైన పర్వత ప్రాంతాలలో విస్తృతమైన భయాందోళనలు, పెద్ద ఎత్తున వినాశనాన్ని కలిగించాయి.

రెండు విద్యుత్ ప్రాజెక్టులు - ఎన్టిపిసి తపోవన్-విష్ణుగడ్ హైడెల్ ప్రాజెక్ట్, రిషి గంగా హైడెల్ ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. జలాలు వేగంగా రావడంతో అనేక మంది కార్మికులు గల్లంతయ్యారు. సొరంగాల్లో చిక్కుకున్న 16 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. మరో వందమందికిపైగా గల్లంతయ్యారు.

English summary
The water level of the Dhauliganga river at Joshimath flowed at a perilously high level, breaching all records, Central Water Commission officials said after a part of the Nanda Devi glacier broke off in Uttarakhand’s Chamoli district leading to massive floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X