బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎంకే షాక్: జైల్లో శశికళతో దినకరన్, నోరుజారాడు, నా వర్గంలో 122 మంది ఎమ్మెల్యేలు !

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజన్ తో ఆమె సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ భేటీ అయ్యారు.

జైల్లో శశికళకు వందనాలు: తమిళనాడు సీఎంతో సహ మంత్రులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు!జైల్లో శశికళకు వందనాలు: తమిళనాడు సీఎంతో సహ మంత్రులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు!

బెంగళూరు చేరుకున్న టీటీవీ దినకరన్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని అధికారుల దగ్గర టోకన్ తీసుకున్నారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు సూచించిన సమయం కోసం దాదాపు మూడు గంటల పాటు వేచి ఉన్న దినకరన్ తరువాత జైలు ఆవరణంలోకి వెళ్లాడు.

దర్జా కాలం పోయింది !

దర్జా కాలం పోయింది !

సాధారణ ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు కలిసే సాధారణ హాల్ లోకి కొంత సేపటి తరువాత వచ్చిన శశికళ, ఆమె వదిన ఇళవరసితో దినకరన్ భేటీ అయ్యారు. ఇంత కాలం దర్జాగా గంటల గంటలు మాట్లాడుకున్న కాలం గంగలో కలిసిపోవడంతో కేవలం 15 నిమిషాల సమయం శశికళతో మాట్లాడిన దినకరన్ జైలు బయటకు వచ్చేశారు.

Recommended Video

Can Sasikala replace Jayalalitha? OPS VS Sasikala - Oneindia Telugu
నోరు జారి నిజం చెప్పాడు

నోరు జారి నిజం చెప్పాడు

టీటీవీ దినకరన్ జైలు బయట తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ నోరు జారేశారు. జైల్లో శశికళకు అన్ని సధుపాయాలు కల్పిస్తున్నారని మీడియాకు చెప్పిన దినకరన్ తరువాత నాలుక కరుచుకున్నాడు. అన్ని సధుపాయాలు కల్పించలేదని చెప్పడానికి బదులు అన్ని సధుపాయాలు కల్పిస్తున్నానని చెప్పానని మాట మార్చాడు.

కచ్చితంగా వెలుతాను !

కచ్చితంగా వెలుతాను !

ఆగస్టు 5వ తేది (శనివారం) చెన్నైలోని రాయపేట్ లో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి తాను వెళ్లి అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తానని, శశికళ కూడా సూచింరానని, నన్ను ఎవరూ అడ్డుకోలేరని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశాడు.

సీఎం పళనిసామికి ఝలక్ !

సీఎం పళనిసామికి ఝలక్ !

అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని 122 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని టీటీవీ దినకరన్ మీడియాకు షాక్ ఇచ్చారు. సీఎం ఎడప్పాడి పళనిసామి కూడా మీకు మద్దతు ఇస్తున్నారా ? అని మీడియా ప్రశ్నిస్తే అవును అంటూ సమాధానం ఇచ్చి తిక్కతిక్కగా మాట్లాడారు.

ఆ చాన్స్ పోయింది ?

ఆ చాన్స్ పోయింది ?

శశికళతో టీటీవీ దినకరన్ భేటీ అయ్యారని, సాధారణ ఖైదీలు ఎలా మాట్లాడుకుంటారో అలాగే మాట్లాడటానికి అవకాశం ఇచ్చామని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు అంటున్నారు. డీఐజీ రూప దెబ్బకు అన్ని సౌకర్యాలు కట్ కావడంతో శశికళకు ఇప్పుడు దిమ్మతిరిగిందని సమాచారం.

English summary
sidelined AIADMK (Amma) Deputy General Secretary TTV Dhinakaran met his aunt and party chief V K Sasikala at the Parappana Agrahara central prison Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X