వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాళ్ళతో దాడి చేసుకొన్న చైనా, ఇండియా సైనికులు, లడఖ్‌కు ఆర్మీ చీఫ్ బిపిన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మునిగిన సమయంలో ఇండియా, చైనా సైనికుల మధ్య చిన్న ఘర్షణ చోటుచేసుకొంది. రెండు పక్షాలు ఒకరిపై మరోకరు రాళ్ళు విసురుకొన్నారు.

డొక్లామ్ సరిహద్దు వివాదాన్ని పురస్కరించుకొని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకు డొక్లామ్ వద్ద సైనికులను రెండు దేశాలు మోహరిస్తున్నాయి. చైనా సరిహద్దు వెంట ఇండియా భారీగా సైనికులను మోహరించింది.

ఇండియాపై విద్వేషపూరితంగా చైనా మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. అంతేకాదు ఇండియానే చైనా భూబాగంలోకి ప్రవేశించిందంటూ చైనా ఆరోపణలు చేస్తోంది.

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దుమణిగేలా కన్పించడం లేదు.డొక్లామ్ నుండి సైన్యాన్ని వెనక్కు తీసుకొంటేనే చర్చల గురించి ఆలోచిస్తామని చైనా అధికారులు చెబుతున్నారు. ఈ తరుణంలో డొక్లామ్ వద్ద విధుల్లో ఉన్న సైనికుల మధ్య గొడవ చోటుచేసుకోవడం కలకలాన్ని రేపుతోంది.

 రాళ్ళతో దాడి చేసుకొన్న, ఇండియా, చైనా సైనికులు

రాళ్ళతో దాడి చేసుకొన్న, ఇండియా, చైనా సైనికులు

భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కొంది. లడఖ్ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించిన మరునాడే అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
దేశం మొత్తం స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోయిన వేళ లడఖ్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ వద్ద భారత్-చైనా సైనికులకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇరు పక్షాల సైనికులు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు.

దాడిని ధృవీకరించిన ప్రభుత్వం

దాడిని ధృవీకరించిన ప్రభుత్వం


చైనా సైనికులు రాళ్లతో భారత సైనికులపై దాడిచేస్తున్న విషయం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు వర్గాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనని, దీనివల్ల శాంతికి విఘాతం కలుగుతుందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనను చూస్తే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏ రకంగా ఉన్నాయో అర్ధమౌతోంది.

లడఖ్‌లో పర్యటించనున్న ఆర్మీ చీఫ్

లడఖ్‌లో పర్యటించనున్న ఆర్మీ చీఫ్

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ఆర్మీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకొంటున్నారు. తాజాగా లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన రాళ్లదాడి పరిణామాల నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ లద్దాఖ్‌లో పర్యటించనున్నారు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో తూర్పు లద్దాఖ్‌లో భద్రతను సమీక్షించనున్నారు.

ఉన్నతాధికారులతో కీలక సమావేశం

ఉన్నతాధికారులతో కీలక సమావేశం


చైనాతో డోక్లామ్‌ ప్రతిష్టంభన, . చైనాతో ఉన్న సరిహద్దులో భద్రతా బలగాల సంసిద్ధతను ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో కీలక విషయాలపై చర్చించనున్నారు.భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాంగాంగ్‌ సరస్సు వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ పర్యటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరహ దాడులు రెండు దేశాలకు మంచివి కావని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చర్చలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు

English summary
A video surfaced on Sunday purportedly showing Indian and Chinese soldiers throwing stones at each other and exchanging blows on August 15 near Pangong Lake in Ladakh, close to the de-factor border between the two countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X