వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్తదేం కాదు! మహాభారతం నుంచే ఇంటర్నెట్: సీఎం బిప్లబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్నెట్‌ అనేది కొత్తగా సృష్టించిన టెక్నాలజీ కాదని మహాభారతం సమయం నుంచే ఇంటర్నెట్‌ ఉందని వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యానించారు.

త్రిపుర రాజధాని అగర్తలాలోని ప్రజ్ఞా భవన్‌లో మంగళవారం నిర్వహించిన కంప్యూటరైజేషన్‌పై వర్క్‌షాప్‌ కార్యక్రమానికి సీఎం బిప్లబ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుక్షేత్రంలో జరిగిన 18 రోజుల యుద్ధం గురించి సంజయ్‌ అనే వ్యక్తి ధృతరాష్ట్రుడికి ఇంటర్నెట్‌ ద్వారానే సమాచారం అందించారని అన్నారు. దీనిని బట్టి చూస్తే మహాభారతం సమయం నుంచే దేశంలో ఇంటర్నెట్‌ సేవలు, శాటిలైట్లు అందుబాటులో ఉండేవని తెలిపారు.

Did internet exist during Mahabharata period: Tripura CM has this take

అలా వేలాది సంవత్సరాల క్రితం అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌ను ఎన్‌ఐసీ(జాతీయ సమాచారం కేంద్రం) వినియోగించుకుంటోందని పేర్కొన్నారు.
'జాతీయ సమాచార కేంద్రం నిర్వాహకుల పనితనాన్ని అభినందిస్తున్నాను. కానీ టెక్నాలజీని మీరు కనిపెట్టలేదు. వేలాది ఏళ్ల క్రితమే కనిపెట్టారు. టెక్నాలజీని తామే కనిపెట్టామని యూరోపా దేశాలు చెప్పుకుంటాయి. కానీ నిజానికి ఆ టెక్నాలజీ మనది' అని బిప్లమ్ అన్నారు.

'మన మైక్రోసాఫ్ట్‌ ఇంజినీర్లు అమెరికాతో పాటు ఇతర విదేశాల్లోనూ పనిచేస్తున్నారు.
సంస్కృతికి మన దేశం పెట్టింది పేరు. అంతేకాదు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే యావత్‌ భారతదేశం టెక్నాలజీకి మరింత దగ్గరైంది. మన ప్రధాని సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటారు. అలాంటి ప్రధాని మనకు దొరకడం మన అదృష్టం. టెక్నాలజీ కేవలం ధనికులకు మాత్రమే కాదు. పేదలు కూడా వినియోగించుకోవాలి' బిప్లమ్ కుమార్ దేబ్ పిలుపునిచ్చారు.

English summary
Did the internet exist during the Mahabharata period? Biplab Kumar Deb, the Chief Minister of Tripura said that the internet is not something new, but existed during the Mahabharata period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X