వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడిలో కొత్తకోణం: పోలీస్ ఆఫీసర్ని కొట్టిన కేంద్రమంత్రి

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: కేంద్రమంత్రి బబుల్ సుప్రియో పైన దాడి కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఆయన పైన రెండు రోజుల క్రితం పలువురు తృణమూల్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రమంత్రే ఓ పోలీసు అధికారి పైన చేయి చేసుకున్నట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి.

తద్వారా ఆయన వివాదంలో చిక్కుకున్నారు. ఓ పోలీస్‌ అధికారిపై ఆయన చేయి చేసుకున్న వీడియో ఒకటి బయటకు రావడంతో ఆయన పైన విమర్శలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Did Minister Babul Supriyo Slap Policeman?

ఆయన తన నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా బబుల్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న తృణముల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. రాళ్లతో కొట్టారు. దీంతో తృణముల్‌, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

ఈ క్రమంలో బబుల్‌తో మాట్లాడేందుకు వచ్చిన ఓ పోలీస్‌ అధికారిపై ఆయన చేయిచేసుకున్నారు. కారు ఫుట్‌బోర్డుపై నిల్చున్న బబుల్‌ పోలీసు అధికారి తలపై కొట్టి, అతని టోపీ తీసి విసిరిపారేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, బబుల్‌పై రాళ్లదాడికి నిరసనగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇంటీ వద్ద బీజేపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.

English summary
As the BJP hit the streets of Kolkata in protest against the alleged attack on Union minister Babul Supriyo, a video has surfaced in which the minister is purportedly seen manhandling a policeman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X