• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలపై నిషేధం విధించిందా.. అసలు నిజం ఏమిటి - FACT CHECK

By BBC News తెలుగు
|

మోదీ

ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం జారీ చేసిన ఒక ఆఫీస్ సర్క్యులర్‌ను చూపిస్తూ కొందరు సోషల్ మీడియాలో కేంద్రం ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించిందన్న ప్రచారం ప్రారంభించారు.

వ్యయ విభాగం సెప్టెంబర్ 4న ఈ సర్క్యులర్‌ జారీ చేసింది. బీబీసీ ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్‌కు కూడా ఎంతోమంది పాఠకులు ఈ సర్క్యులర్‌ క్లిప్లింగ్‌ను పంపించారు. దీని వెనుక నిజం ఏంటో తెలుసుకోవాలని కోరారు.

వ్యయం తగ్గించుకోవడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పుడప్పుడూ ఖర్చుల నిర్వహణ కోసం సూచనలు జారీ చేస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్థిక సూచనలను తక్షణం అమలు చేస్తున్నామని ఆ సర్క్యులర్‌‌లో ఉంది.

ప్రస్తుత ఆర్థికస్థితి దృష్టిలో ఉంచుకుని అనవసర ఖర్చుల తగ్గించుకోడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా అందులో చెప్పారు. మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటి అధీనంలోని కార్యాలయాలన్నింటికీ ఆ సూచనలు జారీ చేశారు.

వీటిలో పోస్టర్, డైరీ ముద్రించడాన్ని నిషేధించడంతోపాటూ, ఆవిర్భావ దినోత్సవం లాంటి కార్యక్రమాల రద్దు, కన్సల్టెంట్ల తొలగింపు లాంటివి ఉన్నాయి. కానీ, వీటన్నిటి కంటే ఎక్కువగా ఈ సర్క్యులర్‌ రెండో పేజీలో ఉన్న సూచనలపై చర్చ జరిగింది.

కొత్త పదవులను సృష్టించడంపై నిషేధం ఉంటుందని అందులో ఉంది. కానీ. వ్యయ విభాగం, మంత్రిత్వ శాఖలు, విబాగాలు, సబార్డినేట్ ఆఫీసులు, చట్టబద్ధమైన సంస్థలు లాంటివి అవసరం అనుకుంటే తమ అనుమతితో ఆ పదవులు సృష్టించవచ్చని చెప్పారు.

ఏదైనా ఒక పదవిని 2020 జులై 1 తర్వాత ఏర్పాటు చేసుంటే, అందులో ఇంకా నియామకం జరగకపోతే, వాటిని వెంటనే రద్దు చేయాలని కూడా సూచించారు.

సోషల్ మీడియాలో ఏం చెబుతున్నారు

వ్యయ విభాగానికి చెందిన ఈ ఆఫీస్ సర్క్యులర్‌ బయటికొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరిగింది.

ఒక వార్తా పత్రిక క్లిప్పింగ్‌ను ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కోవిడ్-19 సాకుతో ప్రభుత్వ కార్యాలయాలలో శాశ్వత సిబ్బంది లేకుండా చేస్తోందని ఆరోపించారు.

https://twitter.com/RahulGandhi/status/1302114886718160896

ఆ తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని ఉద్యోగాలపై నిషేధం విధించిందని చెబుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఒక విభాగం ఆఫీస్ సర్కులర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సెప్టెంబర్‌లోనూ ఆ సర్క్యులర్‌ సోషల్ మీడియాలో ఇంకా ప్రచారమవుతూనే ఉంది.

అసలు నిజం ఏంటి

సోషల్ మీడియాలో ఈ సర్క్యులర్‌ వైరల్ అవడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ తర్వాత రోజే వివరణ ఇచ్చింది.

సర్క్యులర్‌‌ను ట్వీట్ చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ పదవుల భర్తీ, ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదని.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ లాంటి వాటిలో భర్తీలు కొనసాగుతాయని చెప్పింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ తన తదుపరి ట్వీట్‌లో వ్యయ విభాగం 2020, సెప్టెంబర్ 4న జారీ చేసిన సర్క్యులర్‌ కేవలం కొత్త పదవులను సృష్టించే అంతర్గత ప్రక్రియకు సంబంధించినది మాత్రమేనని చెప్పింది. దీని ప్రభావం కొత్త నియామకాలపై ఉండదని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలపై ఎలాంటి నిషేధం విధించలేదని, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ సర్క్యులర్‌ అంతర్గత ప్రక్రియ కింద సృష్టించే కొత్త పదవుల కోసమేనని మేం 'బీబీసీ ఫ్యాక్ట్ చెక్‌’లో గుర్తించాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
news making rounds that Modi govt had banned jobs. ఈ సర్క్యులర్‌లో పోస్టర్, డైరీ ముద్రించడాన్ని నిషేధించడంతోపాటూ, ఆవిర్భావ దినోత్సవం లాంటి కార్యక్రమాల రద్దు, కన్సల్టెంట్ల తొలగింపు లాంటివి ఉన్నాయి. కానీ, వీటన్నిటి కంటే ఎక్కువగా ఈ సర్క్యులర్‌ రెండో పేజీలో ఉన్న సూచనలపై చర్చ జరిగింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X