వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్ఎస్ విరాట్‌లో రాజీవ్‌గాంధీ విహారయాత్ర చేయలేదు.. నేవీ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : ఐఎన్ఎస్ విరాట్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విహార యాత్రకు వెళ్లారా అనే అంశంపై ఇండియన్ నేవీ స్పందించింది. ఈ అంశంపై ఓ పత్రిక సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడంతో ఈ మేరకు రిప్లే ఇచ్చింది. తన వ్యక్తిగత అవసరాల కోసం ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ గాంధీ ఉపయోగించలేరని స్పష్టంచేసింది. అయితే యుద్ధ నౌక వెళ్లే మార్గంలో మాత్రం రాజీవ్‌తోపాటు సోనియా కూడా పయనించారని పేర్కొంది.

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోడీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలు చేశారు. ఐఎన్ఎస్ విరాట్‌ యుద్ధ నౌకను తన విహార యాత్ర కోసం ఉపయోగించారని కామెంట్ చేయడంతో దుమారం చెలరేగింది. రాజీవ్‌తోపాటు సోనియా, పిల్లలు రాహుల్, ప్రియాంక కూడా పయనించారని మోడీ ఆరోపించారు. అయితే దీనిపై ప్రముఖ దినపత్రిక సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసింది. ఎన్నిసార్లు రాజీవ్ యుద్ధ నౌకలను ఉపయోగించారని అడిగింది. దీనిపై భారత నౌకాదళం స్పందిస్తూ .. నేవీలో వ్యక్తిగత ప్రయానాలు నిషేధమని స్పష్టంచేసింది. ఎంతటివారినైనా తాము యుద్దనౌకలోకి అలో చేయమని తేల్చిచెప్పింది.

Did Rajiv Gandhi holiday on INS Viraat? Navy answers

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1987 డిసెంబర్ 28న త్రివేండ్రంలో ఐఎన్ఎస్ యుద్ధనౌకలోకి ప్రవేశించారని పేర్కొన్నది. ఆయన మరునాడు లక్ష్యదీవులో దిగారని ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆయనతోపాటు సోనియాగాంధీ కూడా ఉన్నారని తెలిపింది. అయితే వారితో ఉన్న వారి వివరాలు రక్షణశాఖ వద్ద లేదని వివరించింది. అయితే రాజీవ్‌తోపాటు విదేశీయులు కూడా ఉన్నారా అని ప్రశ్నిస్తే .. ఆ సమయంలో విదేశీయులు ఉన్నారా అనే అంశంపై తమ వద్ద సమాచారం లేదని పేర్కొన్నది. వారు ప్రయాణించిన సమయంలో రోజువారీ వ్యయానికి సంబంధించిన వివరాలు కూడా లేవని మరో సమాధానం ఇచ్చింది భారత నౌకాదళం. దీంతో ఐఎన్ఎస్ విరాట్‌లో మాజీ ప్రధాని విహార యాత్ర చేయలేదని అధికారింకగా స్పష్టమైంది. మరి దీనిపై ప్రధాని మోడీ, అధికార బీజేపీ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.

English summary
In its reply, the Integrated Headquarters of the Ministry of Defence (Navy) said, "Unauthorised/private journeys are not permitted onboard Indian Navy ships". In response to a question if the then Prime Minister Rajiv Gandhi used the INS Viraat for his personal vacation in the Lakshadweep in 1987, the Indian Navy said, "Late prime Minister Rajiv Gandhi had embarked on INS Viraat off Trivandrum on December 28, 1987 and disembarked off Minicoy on December 29, 1987 in his capacity as the Prime Minister of India." As to who all went with Rajiv Gandhi, the Navy replied: "Smt Sonia Gandhi had embarked INS Viraat along with the Late Prime Minister Rajiv Gandhi. No details of the entourage of Late Prime Minister Rajiv Gandhi is available with the concerned directorate at IHQ MoD (N)."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X