వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్ష్యాలివిగో: ఈమెయిల్‌ని కనిపెట్టింది భారతీయుడే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఈమెయిల్ సృష్టికర్తను తానెనంటూ ఓ ప్రవాస భారతీయుడు ముందుకొచ్చారు. జాతి వివక్షలో భాగంగా తనకు అన్యాయం జరిగిందని ఓ వీడియోని యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. వివరాల్లోకి వెళితే శివ అన్నాదురై ముంబైలో జన్మించారు. ఏడేళ్ళ వయసులోనే తన కుటుంబంతో సహా అమెరికా వలస వెళ్ళారు.

నిజానికి ఈమెయిల్ సృష్టికర్తను తానేనని చెప్పుకొచ్చాడు. కానీ తాను నిమ్న కులానికి చెందినవాడినని, నల్ల జాతీయడనని ముఖ్యంగా భారతీయడిని కావడం వల్లే తనకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈమెయిల్‌ను సృష్టించింది రేథియాన్ అనే అమెరికాలోని భారీ రక్షణ శాఖ కాంట్రాక్టర్, ఆయుధాల పరిశ్రమలో పనిచేసిన టామ్లిసన్ కాదని అన్నారు.

ఒక్క అబద్ధం చెప్పడం ద్వారా ఆ కంపెనీ లాభాలను ఆర్జిస్తోందని శివ అన్నాదురై ఆరోపించారు. టామ్లిసన్ కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే పంపించగలిగారని, కానీ తాను ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈమెయిల్ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశానని అన్నారు.

తాను రూపొందించిన ఈమెయిల్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఫర్ ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌‌కు కాపీరైట్ అమెరికాలో మొట్టమొదటిసారి 1982లో తనకు లభించిందని శివ చెప్పారు. ఈమెయిల్‌ను సృష్టించినందుకు గాను 1981లో తాను అనేక వార్డులను కూడా అందుకున్నానని చెప్పారు.

Did Shiva Ayyadurai Invent Email? It Isn't Simple and You're Probably Missing the Point

స్మిత్‌సోనియన్ నేషనల్ మ్యూజియం, వెస్టింగ్‌హౌస్ సైన్స్ టాలెంట్ సెర్చ్ వంటి ఘనమైన సంస్థలు అవార్డులు ఇచ్చిన జాబితాలో ఉన్నాయన్నారు. తానే ఈమెయిల్ సృష్టికర్త అని చెప్పేందుకు తగిన ఆధారాలను కూడా శివ అన్నాదురై చూపిస్తున్నారు.

తాను చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఈమెయిల్ సృష్టికర్త శివ అన్నాదురై అందరూ విశ్వసిస్తున్నారు. అంతేకాదు శివ అన్నాదురైకు నోమ్ చోమ్‌స్కీ వంటి ఉద్యమకారులు సైతం మద్దతు తెలిపారు. కాగా, న్యూయార్క్‌లో జన్మించిన రేమండ్ టామ్లిసన్‌ ఈమెయిల్‌ను సృష్టించినట్లు ఇప్పటి వరకు గుర్తింపు పొందారు. [గుండెపోటుతో ఈమెయిల్ సృష్టికర్త రాయ్ కన్నుమూత]

ఈమెయిల్ అడ్రస్‌లో ఉపయోగించే @ గుర్తును కూడా మొదట ఆయనే ఉపయోగించారు. తొలి రోజుల్లో టామ్లిసన్‌ ఆర్పానెట్‌ ద్వారా మొదటి ఈమెయిల్‌‌ను పంపించారు. అయితే ఆ మెయిల్‌ ఏం రాశారు అనే విషయం తనకు గుర్తులేదని, అది పూర్తిగా మర్చిపోదగిన విషయం అని టామ్లిసన్‌ గతంలో వెల్లడించారు.

సోమవారం మరణించిన రేమండ్ టామ్లిసన్‌కు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు చెందిన జీ మెయిల్ కూడా ఆయన కృషికి ధన్యవాదాలు చెబుతూ నివాళులర్పించింది.

English summary
The history of inventions is so rife with feuds and controversies, claims and counterclaims of discovery, that it has its own Wikipedia page. Most major concepts and inventions have some sort of controversy surrounding its birth. Calculus, the incandescent light bulb, the telephone and the radio are just a few examples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X