వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్యా ? హత్యా ? ఏం తేల్చారు . సీబీఐ కి మహారాష్ట్ర హోం మంత్రి ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ విచారణ జరుపుతుంది. సుశాంత్ మృతి చెంది ఇంత కాలం అవుతున్నా ఆయన మరణంపై సీబీఐ దర్యాప్తులో ఇంకా ఏమీ తేల్చలేదని దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఫైర్ అయ్యారు . ఈ కేసులో సీబీఐ విచారణ ఫలితాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఒకటిన్నర నెలలుగా సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని కేసులో దీని తుది ఫలితం ఏమిటని ప్రశ్నించారు .

 సిబిఐ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్

సిబిఐ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సిబిఐ దర్యాప్తు ఆలస్యం కావడం సుశాంత్ కుటుంబాన్ని, అభిమానులను బాధపెడుతుండగా, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ దీనిని ప్రశ్నించారు. ముంబై పోలీసులు దర్యాప్తును చేస్తున్నా , ఈ కేసును సీబీఐ కి అప్పగించటంతో అనిల్ దేశ్ ముఖ్ తీవ్ర అసహనంతో ఉన్నారు . సిబిఐ విచారణపై ఆయన ప్రశ్నలవర్షం కురిపించారు . సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా లేదా అతడు హత్య చేయబడ్డాడా? తేలిందా అని అడిగారు .

నెలన్నర కాలం సీబీఐ విచారణలో ఏమి తెలిందో చెప్పండి

నెలన్నర కాలం సీబీఐ విచారణలో ఏమి తెలిందో చెప్పండి


శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అనిల్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ, "దాదాపు ఒకటిన్నర నెలలుగా, మొత్తం మహారాష్ట్ర ప్రజలు, మొత్తం భారత ప్రజలు, సిబిఐ ఈ కేసులో ఏం చేస్తుందో చూడాలని ఎదురుచూస్తున్నారన్నారు . సుశాంత్ కేసును సిబిఐకి అప్పగించడాన్ని మహారాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు అయిన తరువాత బీహార్ పోలీసులు దర్యాప్తు కోసం ముంబై చేరుకున్నప్పుడు కూడా అక్కడ చాలా హై డ్రామా జరిగింది. ముంబై పోలీసులు, బీహార్ నుంచి వచ్చిన పోలీసుల టీమ్ కు సహకరించలేదు. బీహార్‌కు చెందిన ఐపిఎస్ అధికారిని కూడా బిఎంసి నిర్బంధించింది.

బీహార్ , మహారాష్ట్ర ప్రభుత్వాల మాటల యుద్ధం .. సుశాంత్ మృతి కేసులో రంగంలోకి సీబీఐ

బీహార్ , మహారాష్ట్ర ప్రభుత్వాల మాటల యుద్ధం .. సుశాంత్ మృతి కేసులో రంగంలోకి సీబీఐ

జూన్లో సుశాంత్ మరణంపై మహారాష్ట్ర మరియు బీహార్ ప్రభుత్వాల మధ్య కొద్దికాలం జరిగిన మాటల యుద్ధం తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు చివరిలో ముంబై పోలీసుల నుండి సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన సినీ పరిశ్రమ కోణంలో దర్యాప్తును నిర్వహిస్తోంది. ఇందులో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు . ఇప్పటి వరకు ఏ అంశాన్ని తోసిపుచ్చలేదు అని సిబిఐ ప్రతినిధి ఆర్కె గౌర్ ఇటీవలే చెప్పారు. సుశాంత్ మరణంపై దర్యాప్తు వేగం గురించి రాజ్‌పుత్ కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేసిన కొద్ది రోజుల తరువాత గౌర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నేడు సుశాంత్ కేసులో న్యాయం కోసం జంతర్ మంతర్ లో సత్యాగ్రహం

నేడు సుశాంత్ కేసులో న్యాయం కోసం జంతర్ మంతర్ లో సత్యాగ్రహం


సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్, సుశాంత్ మరణం కంటే ఇప్పుడు డ్రగ్ రాకెట్ పైనే దర్యాప్తు జరుగుతోందని, అలాంటి పరిస్థితిలో సుశాంత్ మరణానికి కనీసం కారణాలు కూడా తెలీక సుశాంత్ కుటుంబం నిస్సహాయంగా ఉందని అన్నారు. సుశాంత్ అభిమానులు అక్టోబర్ 2 న ఢిల్లీలో జంతర్ మంతర్‌లో 'సుశాంత్ కోసం సత్యాగ్రహం' నిర్వహిస్తున్నారు. సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు . అయితే, రాజ్‌పుత్ కుటుంబం వారి దర్యాప్తులో సంతృప్తి చెందలేదు, ఆ తర్వాత సుశాంత్ తండ్రి కెకె రాజ్‌పుత్ తన కుమారుడి మృతికి రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు కారణం అంటూ ఫిర్యాదు చేశారు.

Recommended Video

Sushant Singh Rajput : Sushant కనపడక దయనీయ స్థితిలో పెంపుడు కుక్కలు..!
సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు.. డ్రగ్స్ కేసుతో కేసు పక్కదారి పడుతుందని ఆందోళన

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు.. డ్రగ్స్ కేసుతో కేసు పక్కదారి పడుతుందని ఆందోళన


ఇక ఈ కేసులో పలు పరిణామాల తర్వాత రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్, రాజ్‌పుత్ కుక్ నీరజ్ సింగ్, అతని రూమ్మేట్ సిద్ధార్థ్ పితాని మరియు అతని మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో సహా చాలా మందిని సిబిఐ ఇప్పటివరకు ప్రశ్నించింది. ముంబై బాంద్రాలోని సుశాంత్ ఉన్న అపార్ట్మెంట్ కు ఏజెన్సీ అనేకసార్లు వెళ్ళింది . సంఘటనా స్థలాన్ని , సుశాంత్ ఇంటిని పలు కోణాల్లో పరిశీలించింది . ఈ కేసులో సుశాంత్ సింగ్ పై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని సీబీఐ కి ఎయిమ్స్ వైద్యుల బృందం సీబీఐ కి రిపోర్ట్ ఇచ్చింది . అయితే సుశాంత్ మరణం కేసు డ్రగ్స్ కేసుతో పక్కదారి పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది .

English summary
Maharashtra home minister Anil Deshmukh on Friday trained guns on the Central Bureau of Investigation (CBI), which is probing Bollywood actor Sushant Singh Rajput’s death, saying people have been waiting for results of the agency’s inquiry into the case.“Did #SushantSinghRajput die by suicide or was he murdered? Mumbai Police was investigating very well when suddenly case was handed over to CBI. They should tell us the result at the earliest,” he was quoted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X