వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రభుత్వం ఈ హామీలు నిలబెట్టుకుందా? బ్యాంకులో 15 లక్షలు వేశారా?: చిదంబరం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న హామీన నెరవేర్చరా? అని ప్రశ్నించారు. అంతేగాక, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేసిందా? అని నిలదీశారు.

రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ బిల్లులపై మోదీ హర్షం - ఆ ఎంపీలపై చర్యలు?రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ బిల్లులపై మోదీ హర్షం - ఆ ఎంపీలపై చర్యలు?

రైతుల పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ చెబుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.. ఇప్పటి వరకు ఆ పని ఎందుకు చేయలేదని చిదంబరం ప్రశ్నించారు. రైతులకు ఏ విక్రయదారు వద్ద అమ్మితే లాభం వస్తుందనే విషయం ఎలా తెలుస్తుందని చిదంబరం నిలదీశారు.

Did the Modi government fulfilled the promise of putting Rs 15 lakh in the bank account of every Indian?: Chidambaram

మంత్రి వద్ద ఎలాంటి డేటా లేకపోయినా.. ఎంఎస్పీపై హామీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న ఇలాంటి హామీలను నమ్మేందుకు రైతులేమైనా అమాయకులా? అని ఆయన ప్రశ్నించారు. అంతేగాక, ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలోకి రూ. 15 లక్షలు వేస్తామన్న మోడీ ప్రభుత్వ హామీ నెరవేరిందా? అని నిలదీశారు.

కాగా, వ్యవసాయానికి సంబంధించిన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మార్స్ సర్వీసు బిల్లులకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలుపగా, ఆదివారం రాజ్యసభ కూడా ఆమోదించింది. ఇక రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు అమలులోకి రానున్నాయి.

Recommended Video

P.Chidambaram Is The First Former Home Minister Who Arrested By CBI | Oneindia Telugu

పార్లమెంటులో ఈ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర నిరసనలు ప్రదర్శనలు చేపట్టాయి. గందరగోళం సృష్టించాయి. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ మైక్ ను కూడా కొందరు సభ్యులు లాగేసేందుకు ప్రయత్నించారు దీంతో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకునేందుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డిప్యూటీ ఛైర్మన్ సహా, పలువురు మంత్రులు పాల్గొన్నట్లు సమాచారం.

English summary
Did the Modi government fulfilled the promise of putting Rs 15 lakh in the bank account of every Indian?: Chidambaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X