వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిలదీసిన వలస కూలీ.. ఎమ్మెల్యే ఎంత మాటన్నాడు.. దుమారం రేపుతున్న కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

బీహార్‌లోని షేక్‌పురాకు చెందిన జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోని ఓ వలస కూలీ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 22న షేక్‌పురా జిల్లాలోని చాంది గ్రామంలో ఉన్న ఓ క్వారెంటైన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్వారెంటైన్‌లో ఉన్న వలస కూలీలతో ఆయన మాట్లాడగా.. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీస్తూ వారు ఎమ్మెల్యేని పలు ప్రశ్నలు అడిగారు.

అందులో ఓ వ్యక్తి... బీహార్ ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఎందుకు విఫలమయ్యాయి అని ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ ఎమ్మెల్యే.. 'నిన్ను కన్న నీ తండ్రి నీకేదైనా జాబ్ ఇచ్చాడా..?' అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. చాలామంది నెటిజెన్స్ ఎమ్మెల్యే రణధీర్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

షాకింగ్ : 9 కాదు.. 10 హత్యలు.. గొర్రెకుంట హత్యల కేసులో మరో నిజం వెలుగులోకి..షాకింగ్ : 9 కాదు.. 10 హత్యలు.. గొర్రెకుంట హత్యల కేసులో మరో నిజం వెలుగులోకి..

 Did your father give you a job jdu mla reply to a migrant worker

Recommended Video

US Economy To Shrink At Fastest Rate Since 1946, Unemployment Rise

ప్రజా ప్రతినిధిగా బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఇంత నిర్లక్ష్యపూరిత సమాధానమా అని ప్రశ్నిస్తున్నారు. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి ప్రతాప్ సైతం రణధీర్ కుమార్‌పై మండిపడ్డారు. ఆయన స్టేట్‌మెంట్ అసంబద్దంగా ఉందన్నారు. మరోవైపు రణధీర్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను వలస కూలీలను ఉద్దేశించి ఆ కామెంట్ చేయలేదని.. ఆ వ్యక్తి తనకు చాలా రోజులుగా పరిచయం ఉన్నవాడేనని అన్నారు. దీనిపై అవనసర రాద్దాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

English summary
JD (U) MLA from Sheikhpura, Randhir Kumar Soni, is facing criticism for his remarks in reply to a migrant’s question on why NDA governments at the Centre and Bihar had not been able to create adequate job opportunities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X