వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన.. ఎన్డీఏ సర్కార్‌పై దీదీ నిప్పులు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : కశ్మీర్‌లో పరిస్థితి ఏం బాగోలేదన్నారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కశ్మీర్ లోయలో 40 వేల మంది బలగాలను మొహరించి .. పరిస్థితి బాగుందని చెప్తున్నారని విమర్శించారు. అక్కడి ప్రజలు కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచ మానవతా దినోత్సవం .. కానీ కశ్మీర్‌లో అక్కడి ప్రజలు తమ హక్కులను కూడా కోల్పోయారని ఆమె పేర్కొన్నారు.

ఈ మేరకు సోమవారం ఎన్డీఏ సర్కార్‌పై విరుచుకుపడుతూ రెండు ట్వీట్లు చేశారు మమతా బెనర్జీ.కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనికి కారణం మాత్రం ఎన్డీఏ సర్కార్ అని దుయ్యబట్టారు మమతా బెనర్జీ. ఇప్పటికైనా కశ్మీర్‌లో మానవ హక్కులు ఉల్లంఘన జరగకూడదని, శాంతి నెలకొనాలని ఆ భగవంతుడిని తాను కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. కశ్మీర్‌ లోయలో పరిస్థితికి కారణం ఎన్డీఏ పాలకులేనని దుయ్యబట్టారు.

didi fire on pm narendra modi

వారి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని విమర్శించారు. ఢిల్లీలో కూర్చొన్న పెద్దలకు ప్రజల కష్టం అంటే ఏంటో పట్టదని మండిపడ్డారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం బాధకరమని అభిప్రాయపడ్డారు మమతా బెనర్జీ. 1995లో లాకప్ డెత్ జరిగాయని 21 రోజులు రహదారిపై ఆందోళన చేశానని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు. కానీ కశ్మీర్‌లో మాత్రం అక్కడి ప్రజల హక్కులను హరించడం బాధకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర పెద్దలు తాముచేసిన తప్పులను తెలుసుకోవాలని సూచించారు.

English summary
Today is World Humanitarian Day. Human rights have been totally violated in Kashmir. Let us pray for human rights and peace in says bengal cm mamatha. Human rights is a subject very close to my heart. In 1995, I was on the road for 21 days to protect human rights violations against deaths in lock-ups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X