వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదంతా బీజేపీ కుట్ర.. సమ్మె చేస్తున్న జూడాలకు దీదీ అల్టిమేటం..

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య నెలకొన్న ఘర్షణలతో సతమతమవుతున్న బెంగాల్ సీఎం మమత బెనర్జీకి మరో తలనొప్పి మొదలైంది. రోగి బంధువులు దాడి చేశారన్న కారణంతో మూడు రోజులుగా ఆందోళన చేపట్టిన డాక్టర్లు సమ్మె మరింత ఉధృతం చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందక పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం మమత బెనర్జీ వచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదని జూనియర్ డాక్టర్లకు తేల్చిచెబుతున్నారు.

నాకంతా తెలుసు.. కార్యకర్తలకు ప్రియాంక వార్నింగ్..నాకంతా తెలుసు.. కార్యకర్తలకు ప్రియాంక వార్నింగ్..

జూడాలకు దీదీ అల్టిమేటం

జూడాలకు దీదీ అల్టిమేటం

రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం హాస్పిటల్‌కు వెళ్లిన మమతా బెనర్జీ పరిస్థితిని సమీక్షించారు. సీఎంను చూసిన వెంటనే జూడాలు వి వాంట్ జస్టిస్ నినాదాలు చేయడంపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లకు వెంటనే విధుల్లో చేరాలని వార్నింగ్ ఇచ్చారు. నాలుగు గంటల్లోగా అందరూ రిపోర్ట్ చేయాలని అల్టిమేటం జారీ చేశారు.

సమ్మె వెనుక బీజేపీ కుట్ర

సమ్మె వెనుక బీజేపీ కుట్ర

బెంగాల్‌లో జూడాల సమ్మె బీజేపీ కుట్ర అని దీదీ ఆరోపించారు. వారి కారణంగానే బెంగాల్‌వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఓపీ సేవలు బంద్ చేయడంతో ట్రీట్‌మెంట్ అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తేలేదని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. సీఎం ఈ విషయంలో జోక్యం చేసుకుని డిమాండ్ చేస్తున్నారు.

డాక్టర్‌పై రోగి బంధువుల దాడి

డాక్టర్‌పై రోగి బంధువుల దాడి

కోల్‌కతాలోని ఎస్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఓ రోగి మృతి చెందడం వివాదానికి కారణమైంది. మరణానికి డాక్టర్లే కారణమంటూ పేషెంట్ బంధువులు జూనియర్ డాక్టర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో అతని పుర్రెకు తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ ఐసీయూలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.

English summary
Bengal CM Mamata Banerjee has issued a four-hour ultimatum to doctors in West Bengal who have been on a protest over an attack on their colleague. Didi visited the state-run SSKM hospital in Kolkata where she asked the agitating junior doctors, in turn, to return to work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X