వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు చేయలే: బీజేపీతో పొత్తు సహజమే: ఏక్ నాథ్ షిండే

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే రెబల్ ఎమ్మెల్యేలు.. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎలాంటి తప్పు చేయలేదని షిండే అన్నారు. బీజేపీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది సహజ సిద్దం అని చెప్పారు. అలాగే తమ మంత్రివర్గంలోకి ఫడ్నవీస్ రావాలని ఎమ్మెల్యేలు కోరుకున్నారని ఆయన చెప్పారు. అందుకోసమే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారని వివరించారు.

తమకు పూర్తి మెజార్టీ ఉందని షిండే అన్నారు. 170 మంది సభ్యుల మద్దతు ఉందని వివరించారు. బాల్ థాకరే ఆలోచనా విధానంతో ముందుకెళ్తామని చెప్పారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతిపక్షంలోకి వెళ్లబోతుందని తెలిపారు. ఇదివరకు గల కూటమికి చెందిన ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అభివృద్ది.. వారి నియోజకవర్గం డెవలప్ జరుగుతుందని తెలిపారు.

 Didnt do anything wrong, forming govt with BJP in Maharashtra

తమ ప్రభుత్వంలో చేరనని ఫడ్నవీస్ ముందే చెప్పారని షిండే తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాలు పంచుకోవాలని అనుకున్నామని తెలిపారు. బీజేపీ హై కమాండ్ డిప్యూటీ సీఎం పదవీ చేపట్టాలని కోరిందని వివరించారు. దీంతో ఆయన పదవీ చేపట్టక తప్పలేదని చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎంగా చేస్తానని చెప్పడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు.

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రివర్గం ఏర్పాటు కాకపోయినా.. షిండే, ఫడ్నవీస్.. సీఎం, డిప్యూటీలుగా ప్రమాణం చేశారు. దీంతో శివసేన అధినేత ఉద్దవ్ థాకరే రగిలిపోతున్నారు. అందుకే షిండేపై చర్యలు తీసుకున్నారు. శివసేన పార్టీలో షిండే పదవులు అన్నింటిని తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారని.. అందుకోసమే చర్యలు తీసుకున్నామని తెలిపారు.

English summary
Maharashtra Chief Minister Eknath Shinde has said that the rebel Shiv Sena MLAs did not do anything wrong by forming a government in the state with the support of the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X