వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో నేను కూర్చోలేదు: అమిత్ షా, జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ ఫొటోలతో!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌సభలో మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. అమిత్ షా తన పశ్చిమబెంగాల్ పర్యటనలో శాంతినికేతన్‌లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో కూర్చొని ఆయనను అగౌరవపర్చారంటూ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. తాను ఠాగూర్ సీటులో కూర్చోలేదన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరిలో బెంగాల్ పర్యటనలో శాంతినికేతన్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభలో మాట్లాడుతూ.. అమిత్ షా శాంతినికేతన్ సందర్శించినప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో కూర్చుని ఆయన్ను అగౌరపర్చారని ఆరోపించారు. దీనిపై అమిత్ షా ఘాటుగా స్పందించారు.

Didnt Sit On Rabindranath Tagores Seat: Amit Shah, Shows Photos In House

'నేను శాంతినికేతన్ సందర్శించినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో కూర్చోలేదు. నేను కేవలం కిటికీ దగ్గర మాత్రమే కూర్చున్నా. అక్కడ ఎవరైనా కూర్చోడానికి అనుమతి ఉంది. నేను అక్కడ కూర్చోలేదని నిర్ధారిస్తూ విశ్వభారతి వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఇచ్చిన లేఖ కూడా ఉంది' అంటూ అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.

గతంలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా శాంతినికేతన్ సందర్శించినప్పుడు అక్కడే కూర్చున్నారని అమిత్ షా తెలిపారు. కాగా, అధిర్ రంజన్ చౌదరి చేసిన ఆరోపణలను తప్పుడు సమాచారంగా పేర్కొంటూ విశ్వభారతి వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ విద్యుత్ చక్రవర్తి లేఖ విడుదల చేశారు.

అంతేగాక, తాను రవీంద్రనాథ్ ఠాగూర్ కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేసిన అమిత్ షా.. అయితే, మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ మాత్రం ఠాగూర్ కుర్చీలోనే కూర్చున్నారంటూ అందుకు సంబంధించిన ఫొటోలను చూపించారు. ఆ ఆ ఫొటోలను సోషల్ మీడియాలోనూ పంచుకున్నారు.

English summary
Home Minister Amit Shah today denied a Congress leader's charge that he sat on Rabindranath Tagore's seat during a visit last month to Santiniketan in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X