నువ్వు ఎవరో తెలీదు అనే టైపు లో రెండు ప్రత్యేక విమానాల్లో సిద్దూ, డీకేశీ ఢిల్లీకి జంప్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకకు సీఎం కావాలని డీకే. శివకుమార్, సిద్దరామయ్య పోటీ పడుతున్నారు. తనకే సీఎం సీటు ఇవ్వాలని, లేదు తననే సీఎం చెయ్యాలని సిద్దరామయ్య, డీకే శివకుమార్ హైకమాండ్ కు మనవి చేస్తున్నారు. ఇద్దరితో రాజీ చర్చలు జరపడానికి ఢిల్లీకి రావాలాని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్దరామయ్య, డీకే. శివకుమార్ కు సూచించింది.
సోమవారం మీరు ఢిల్లీకి రావాలని ఆదివారం రాత్రే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్దరామయ్య, డీకే. శివకుమార్ కు చెప్పింది. అయితే తాను ఢిల్లీ వెళ్లనని, బెంగళూరులోనే ఉండి తాడోపేడో తేల్చుకుంటానని డీకే శివకుమార్ ఆయన సన్నిహితులతో చెప్పారని తెలిసింది. తాను కష్టపడి రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించానని డీకే శివకుమార్ అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపురావడంతో మాజీ సీఎం సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లడానికి సిద్దం అయ్యారు. బెంగళూరులో హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సిద్దరామయ్య ఢిల్లీ బయలుదేరడానికి రెఢీ అయ్యారు. సిద్దరామయ్యతో పాటు కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరులోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెలుతున్నారని తెలిసింది.
అయితే ఢిల్లీకి వెళ్లనని చెబుతున్న డీకే శివకుమార్ తరువాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో మాట్లాడాలని చివరికి ఆయన తన మనసు మార్చుకున్నారని తెలిసింది. సోమవారం డీకే శివకుమార్ బర్త్ డే. పుట్టిన రోజు నాడు శుభవార్త వింటానా, లేక సిద్దరామయ్యను సీఎం చెయ్యడానికి అంగీకరించాలా అనే డైలమాలో డీకే శివకుమార్ ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దల ముందు హాజరుకావడానికి ఢిల్లీ వెలుతున్నారు. అయితే ఇద్దరూ ఒకే విమానంలో కాకుండా బెంగళూరు నుంచి రెండు వేర్వేరు ప్రత్యేక విమనాల్లో ఢిల్లీ బయలుదేడానికి సిద్దం కావడంతో అప్పుడే ఇద్దరి మధ్య తేడా కొట్టిందని స్పష్టంగా వెలుగు చూస్తోంది. ఉండేది ఒకే ఖర్చీ, అయతే ఇద్దరు బలమైన నాయకులు ఆదే కుర్చి కోసం ముసుగులో గుద్దులాటకు దిగడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా తయారైయ్యింది.












Click it and Unblock the Notifications