వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ముసలం...కమల్‌నాథ్ టార్గెట్‌గా సింధియా వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ముసలం ముదురుతోంది. సొంత పార్టీ వారే ఆ రాష్ట్ర సీఎం కమల్‌నాథ్‌పై అసంతృప్తితో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం అక్కడి మంత్రి ఉమాంగ్ సింగార్ ప్రభుత్వాన్ని కమల్‌నాథ్ నడపడం లేదని దిగ్విజయ్ సింగ్ నడుపుతున్నారన్న హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కమల్‌నాథ్ ఉమాంగ్ సింగార్‌ను దిగ్విజయ్ సింగ్‌లను పిలిచి మాట్లాడి సమస్యకు చెక్ పెట్టాలని సింధియా సూచించారు.

మేకిన్ ఇండియా: అణు ఇంధనం ఉత్పత్తికి భారత్‌కు రష్యా సహకరిస్తుందన్న పుతిన్మేకిన్ ఇండియా: అణు ఇంధనం ఉత్పత్తికి భారత్‌కు రష్యా సహకరిస్తుందన్న పుతిన్

కాంగ్రెస్ ప్రభుత్వంను మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు 15 ఏళ్లుగా కష్టపడ్డామని చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా... ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పని చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులు తను మధ్యప్రదేశ్ పీసీసీగా ప్రకటించాలంటూ నినదించారు. దిగ్విజయ్ సింగ్ జోక్యం ఎక్కువైపోయిందంటూ అటవీశాఖ మంత్రి సింగార్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయాలని ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తి జోక్యం ఉండకూడదంటూ సింధియా వ్యాఖ్యానించారు. సింగార్‌ను దిగ్విజయ్ సింగ్‌ను పిలిచి వారిమధ్య నెలకొన్న విబేధాలు తొలిగిపోయేలా సీఎం కమల్‌నాథ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Differences in MP congress at peak,Scindia targets Kamalnath

ఇదిలా ఉంటే సింగార్, దిగ్విజయ్‌ల మధ్య విబేధాలు తొలిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత సిందియా మళ్లీ అగ్గిరాజేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి సింగార్‌ను సీఎం కమల్‌నాథ్ తన నివాసంకు పిలిపించుకుని మాట్లాడారు. సీఎంకు తను చెప్పాల్సినదంతా చెప్పానని సింగార్ చెప్పారు. ఇదిలా ఉంటే తమ మధ్య ఏమైనా విబేధాలు ఉంటే అది బహిరంగ వేదికలపై కాకుండా పార్టీ ఫోరంలో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.

రాష్ట్రంలో ఇంకా అక్రమ మైనింగ్ కొనసాగుతోందని సిందియా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు 15 ఏళ్లు కష్టపడ్డామని సింధియా చెప్పారు. ఇదిలా ఉంటే మంత్రి సింగార్ దిగ్విజయ్ సింగ్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తూ సింగ్ అనుచరులు ఉమాంగ్ సింగార్ నివాసం బయట ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇదిలా ఉంటే పార్టీలో క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదని కాంగ్రెస్ హెచ్చరించింది.

English summary
Senior Congress leader Jyotiraditya Scindia on Wednesday virtually opened a new front against the Kamal Nath government by throwing his weight behind Forest Minister Umang Singhar and putting him on par with former chief minister Digvijaya Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X