వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1200 కి.మీ కాలినడకన పయనం, పోలియో సోకడంతో ఒక కాలితో, మొక్కవోని ధైర్యంతో ముందుకు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మనషులను చిన్నా భిన్నం చేస్తోంది. వైరస్ వ్యాప్తి వల్ల సకలం బంద్‌తో చిన్న, చితక వ్యాపారులకు పనిలేకుండా పోయింది. దీంతో సొంత రాష్ట్రాల బాట పడుతున్నారు. శ్రామిక్ రైళ్లు నడుపుతోన్న.. అది ఎప్పుడు వస్తుందనే ఓపిక లేక.. అప్పటివరకు జీవితం ఎలా లీడ్ చేయాలో తెలియక కొందరు కాళ్లకు పనిచెబుతున్నారు. కాళ్లు, చేతులు బాగుంటే ఫరవాలేదు.. కానీ ఓ కాలి లేని అజయ్ కుమార్ సాకెట్ మాత్రం.. ఒకటి కాదు రెండు 1200 కిలోమీటర్ల దూరంలో గల తన ఇంటికి బయల్దేరాడు. తన మొక్కవోని విశ్వసాన్ని ఇతరులకు చాటి.. సాహసయాత్రను ప్రారంభించారు.

 సొంత ఊరికి...

సొంత ఊరికి...

అజయ్ స్వస్ధలం మధ్యప్రదేశ్‌లో గల సెదొల్ జిల్లా.. ఉపాధి కోసం ముంబైలో ఉంటున్నాడు. నవీ ముంబై తుర్బే ప్రాంతంలో చిన్న స్టాల్ పెట్టుకొని ఉంటున్నాడు. కానీ లాక్ డౌన్ వల్ల ఉపాధి లేదు. ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. ఎవరి వద్ద చేయిచాచని.. అజయ్, తన ఇంటికి వెళదామని అనుకొన్నాడు. మరికొందరితో కలిసి బయల్దేరారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు.. అతనిని ఇంటర్వ్యూ చేశారు. అతని నేపధ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

1200 కి.మీ పయనం..

1200 కి.మీ పయనం..

అజయ్ కుమార్‌కు చిన్నప్పుడే పోలియో రక్కసి సోకింది. దీంతో ఓ కాలు లేదు. ఒక్క కాలు మీద, మరో భుజం కింద కర్రతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ అతని స్వగ్రామం 1200 కిలోమీటర్ల దూరంలో ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి 5 రోజుల క్రితం శ్రామిక్ రైలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వికలాంగుడినని చూపే పత్రాలను కూడా చూపించాడు. కానీ రైలు కోసం నిరీక్షించే ఓపిక లేదు. ఎందుకంటే రైలు వచ్చేవరకు తన పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం లేకపోవడంతో.. ఎలా గడుస్తుందో తెలియదు అని.. అందుకోసమే బయల్దేరానని చెప్పుకొచ్చారు.

Recommended Video

Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied
 మనస్సున మరాజులు..

మనస్సున మరాజులు..

1200 కిలోమీటర్ల పయనం ఎలా అడిగితే.. తమ వద్ద కొన్ని బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ ఉన్నాయని చెప్పారు. దారిలో తమను ఆదుకొనే మంచి మనస్సున మనుషులు కనిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలా తమ ప్రయాణం కొనసాగి.. స్వస్థలం చేరుతుందని అజయ్ కుమార్.. ధీమా వ్యక్తం చేశారు.

English summary
Ajay Kumar Saket, 30, is differently-abled as his right leg is infected with polio. He can only walk using a cane below his shoulder as support to move ahead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X