బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 20 కోట్లకు పరువునష్టం దావా: ఏసీబీ విచారణకు డీఐజీ రూపా డిమాండ్, జైల్లో శశికళకు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరిగిన అక్రమాలపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలని ట్రాఫిక్ విభాగం డీఐజీ, మహిళా ఐపీఎస్ అధికారి డీ. రూపా డిమాండ్ చేశారు. తన మీద వేసిన పరువు నష్టం దావాను న్యాయస్థానంలో ఎదుర్కొంటానని డీఐజీ రూపా అంటున్నారు.

హీరో కమల్ హాసన్, డీఐజీ రూపా భేటీ, సోషల్ మీడియాలో ఫోటో, ఇంత చర్చ వద్దు!హీరో కమల్ హాసన్, డీఐజీ రూపా భేటీ, సోషల్ మీడియాలో ఫోటో, ఇంత చర్చ వద్దు!

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళతో పాటు అనేక మంది ఖైదీలకు వీఐపీ సేవలు చేస్తున్నారని, ఖైదీల కుటుంబ సభ్యల దగ్గర జైళ్ల శాఖ అధికారులు లంచం తీసుకుంటున్నారని అప్పట్లో డీఐజీ రూపా ఆరోపించిన విషయం తెలిసిందే.

శశికళ దగ్గర రూ. 2 కోట్లు లంచం!

శశికళ దగ్గర రూ. 2 కోట్లు లంచం!

శశికళకు ప్రత్యేక సౌకర్యాలు, నాలుగు గదులు కేటాయించడానికి ఆమె కుటుంబ సభ్యుల దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని, ఈ విషయంపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు, కర్ణాటక ప్రభుత్వానికి డీఐజీ రూపా లేఖ రాశారు.

రిటైడ్ ఐఏఎస్ అధికారి!

రిటైడ్ ఐఏఎస్ అధికారి!

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అవ్యవహారాలపై విచారణ చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించింది. అదే సమయంలో కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీగా పని చేస్తున్న సత్యనారాయణ రావ్ రిటైడ్ అయ్యారు.

రూ. 20 కోట్లకు పరువునష్టం దావా!

రూ. 20 కోట్లకు పరువునష్టం దావా!

తన మీద లేనిపోని ఆరోపణలు చేశారని డీఐజీ రూపా మీద రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ సీనియర్ మాజీ పోలీసు అధికారి సత్యనారాయణ రావ్ ఆమెకు నోటీసులు పంపించారు. తాను చట్టపరంగా సత్యనారాయణ రావ్ మీద న్యాయపోరాటం చేస్తానని డీఐజీ రూపా మీడియాకు చెప్పారు.

 జైల్లో వీఐపీ సేవలు నిజమే!

జైల్లో వీఐపీ సేవలు నిజమే!

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఖైదీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని, వారికి వీఐపీ సేవలు చేస్తున్నారని, జైళ్ల శాఖ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని రిటైడ్ ఐఏఎస్ అధికారి విచారణలో వెలుగు చూసింది. వినయ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ఏసీబీ విచారణ చెయ్యాలి, రూపా!

ఏసీబీ విచారణ చెయ్యాలి, రూపా!

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అక్రమాలు జరిగాయని వినయ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ విచారణలో వెలుగు చూసిందని, ఇప్పుడు ఏసీబీతో విచారణ చేయిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయని డీఐజీ రూపా అంటున్నారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు వ్యవహారంపై ఏసీబీ విచారణ చేయించాలని డీఐజీ రూపా డిమాండ్ చేస్తున్నారు.

English summary
Karnataka IPS officer D Roopa who exposed irregularities in Bengaluru central jail has now demanded an Anti Corruption Bureau probe into the matter. Former Prisons DIG Roopa has been slapped with a Rs 20 crore defamation case by her former boss and prisons chief Satyanarayana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X