బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ కర్మకాండ: బుర్కా వేసుకుని ఎంజీ రోడ్డులో చిన్నమ్మ షాపింగ్, సీసీటీవీ కెమెరాల్లో !

బెంగళూరు సెంట్రల్ జైల్లో నుంచి బయటకు వచ్చిన శశికళ. బుర్కా వేసుకుని వదిన ఇళవరసితో కలిసి ఎంజీ రోడ్డులో షాపింగ్. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు, ఏసీబీ చేతికి క్లిప్పింగ్ ఇచ్చిన డీఐజీ రూపా

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్షకు గురైన వీకే. శశికళ నటరాజన్ అసలు బండారం బయటపడింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ దర్జాగా బయటకు వచ్చి బెంగళూరులోని ప్రసిద్ది చెందిన ఎంజీ రోడ్డులో షాపింగ్ చేశారని వెలుగు చూసింది.

జైల్లో శశికళ 13 రోజులు మాత్రమే: మిగిలిన రోజులు జైలు బయట అపార్ట్ మెంట్ లో జల్సా !జైల్లో శశికళ 13 రోజులు మాత్రమే: మిగిలిన రోజులు జైలు బయట అపార్ట్ మెంట్ లో జల్సా !

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని కొందరు అధికారులు శశికళ, ఇళవరసిని బయటకు వెళ్లడానికి అవకాశం కల్పించారని వెలుగు చూడటంతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. శశికళ, ఇళవరసి మామూలు దుస్తులు వేసుకుని జైలు బయటకు వచ్చారని వెలుగు చూసింది.

 బుర్కా వేసుకుని ఎంజీ రోడ్డులో !

బుర్కా వేసుకుని ఎంజీ రోడ్డులో !

శశికళ నటరాజన్ జైలు నుంచి బయటకు వచ్చి బుర్కా వేసుకుని ఎంజీ రోడ్డులో షాపింగ్ చేశారని, చిన్నమ్మ వెంట ఆమె వదిన ఇళవరసి ఉన్నారని వెలుగు చూసింది. శశికళ, ఇళవరసి మామూలు దుస్తులు వేసుకుని ఎంజీ రోడ్డులో షాపింగ్ చేసిన దృశ్యాలు ఉన్న సీసీటీవీ కెమెరా క్లిప్పింగ్స్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాయి.

Recommended Video

Jayalalithaa Next Sasikala Followed by YS Jagan - Corrupt Politicians - Oneindia Telugu
డీఐజీ రూపా ఇచ్చారు

డీఐజీ రూపా ఇచ్చారు

డీఐజీ రూపా ఏసీబీ దర్యాప్తు అధికారులకు ఇచ్చిన నివేదికలో శశికళ, ఇళవరసి ఎంజీ రోడ్డులో షాపింగ్ చేసినట్లు పూర్తి వివరాలు ఉన్నాయి. నివేదికతో పాటు సీసీకెమెరాల క్లిప్పింగ్స్ ను డీఐజీ రూపా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు అప్పగించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

జైల్లో సీసీటీవీ కెమెరాల్లో

జైల్లో సీసీటీవీ కెమెరాల్లో

జైలు బయటకు వచ్చి మామాలు దుస్తులతో బెంగళూరులో షాపింగ్ చేసిన శశికళ, ఇళవరసి తరువాత చేతిలో బ్యాగ్ పట్టుకుని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వస్తున్న సమయంలో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల క్లిప్పింగ్స్ ను డీఐజీ రూపా ఏసీబీ అధికారులకు అప్పగించారు.

డీఐజీ రూపాకు సమన్లు

డీఐజీ రూపాకు సమన్లు

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అవ్యవహారాల విషయంలో ఆరోపణలు చేసిన డీఐజీ రూపాకు వివరణ, వాటి ఆదారాలు ఇవ్వాలని ఏసీబీ అధికారులు జులై 31వ తేదీన సమన్లు జారీ చేశారు. ఏసీబీ అధికారులు జారీ చేసిన సమన్లుకు వివరణ ఇస్తూ డీఐజీ రూపా నివేదిక ఇవ్వడంతో శశికళ బండారం బయటపడింది.

ఎప్పుడు, ఎక్కడ

ఎప్పుడు, ఎక్కడ

శశికళ, ఆమె వదిన ఇళవరసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి ఏ సమయంలో బయటకు వచ్చారు ? ఎంజీ రోడ్డులో ఏ షోరూంలో వీరు షాపింగ్ చేశారు ? వీరిద్దరినీ జైలు నుంచి బయటకు పంపించిన అధికారులు ఎవరు ? అంటూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద శశికళ జైలు నుంచి బయటకు వచ్చారని కచ్చితంగా వెలుగు చూస్తే చిన్నమ్మ ఇంకా కష్టాల్లో పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

English summary
DIG Roopa has shared CCTV footage with ACB. This footage of Sasikala and Ilavarasi in which both were walking free from Parappana Agrahara jail and roaming around Bengaluru wearing a Burqa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X