బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళ కర్మకాండ: 16 ఏళ్లలో డీఐజీ రూప 27 సార్లు బదిలి, లెక్కచెయ్యను, కొత్తగా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు రాచమర్యాదలు చేస్తున్న విషయం బయటపెట్టిన డీఐజీ రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసి చేతులు దుపులుపుకుంది.

జైల్లో శశికళ కర్మకాండ, రూప బదిలి, అబ్బే అదేం లేదు: సీఎం, కర్ణాటకలో చిన్నమ్మ పెత్తనం!జైల్లో శశికళ కర్మకాండ, రూప బదిలి, అబ్బే అదేం లేదు: సీఎం, కర్ణాటకలో చిన్నమ్మ పెత్తనం!

అయితే డీఐజీ రూపకు బదిలి కొత్త ఏమీ కాదు. ఆమె ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించి 16 ఏళ్లు అయ్యింది. ఆమె సర్వీసులో ఇప్పటి వరకూ 27 సార్లు బదిలి అయ్యారు. ఐపీఎస్ మహిళా అధికారి రూపకు బదిలి కొత్త కాదు. బదిలిని ఆమె శిక్షగానూ భావించరు.

కొత్త బాధ్యత అంటూ !

కొత్త బాధ్యత అంటూ !

ఐపీఎస్ అధికారిణి రూప మౌద్గిల్ ను ఎప్పుడు బదిలి చేసినా తనకు కొత్త బాధ్యత అప్పగించారని అందులో ఇమిడిపోతారు. అయితే ప్రభుత్వం తనకు శిక్ష విధించిందని భావించనని, ఏ బాధ్యత అయినా తాను నిజాయితీతో నిర్వహిస్తానని ఆమె విలేకరులతో అన్నారు.

Recommended Video

Sasikala bribes prison officers, gets luxury treatment in jail | Oneindia News
నేడు కోటి మందికి సేవలు

నేడు కోటి మందికి సేవలు

ఇప్పటి వరకు కారాగారినికే పరిమిత స్థాయిలో ఉన్న రూప సేవలు ఇప్పుడు సుమారు కోటి మంది ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చిన రూపను సోమవారం ట్రాఫిక్ శాఖకు బదిలి చేసిన విషయం తెలిసిందే.

ప్రతిపక్షల చేతికి తూటాలు

ప్రతిపక్షల చేతికి తూటాలు

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అక్రమాలు బయటపెట్టిన డీఐజీ రూపను ప్రభుత్వం వెంటనే బదిలి చెయ్యడంతో ప్రభుత్వాన్ని తూర్పారబట్టేందుకు ప్రతిపక్షాల చేతికి అస్త్రం దొరికింది. ఇప్పటికే రూప విషయంలో సిద్దరామయ్య ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

రూపకు మద్దతు, ఆ ఖైదీల పరిస్థితి ?

రూపకు మద్దతు, ఆ ఖైదీల పరిస్థితి ?

రూపకు మద్దతుగా నిలిచిన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఖైదీలను ఇప్పుడు బళ్లారి, బెళగావి సెంట్రల్ జైలుకు తరలించేపనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఖైదీలు పూర్తి వివరాలు రూపకు చెప్పడం వలనే ఆమె పై అధికారులకు నివేదిక ఇచ్చారని అధికారులు భావిస్తున్నారు.

60 లక్షల వాహనాలు

60 లక్షల వాహనాలు

బెంగళూరు నగరంలో 60 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు బెంగళూరు నగరంలోని అనేక రహదారుల్లో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి డీఐజీ రూప ఇప్పుడు సిద్దం అయ్యారు.

మద్యం సేవించి, వీలింగ్ చేస్తే !

మద్యం సేవించి, వీలింగ్ చేస్తే !

మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య బెంగళూరు నగరంలో ఎక్కువగానే ఉంది. అంతే కాకుండా యువకులు బైక్ తో వీలింగ్ (సాహసకృత్యాలు) చేసే వారు తక్కువగా ఏమీ లేరు. అలాంటి వారి దగ్గర చిల్లర తీసుకుని ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తున్నారు.

రసీదులు ఇవ్వని పోలీసుల పని !

రసీదులు ఇవ్వని పోలీసుల పని !

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిని పట్టుకుంటున్న పోలీసులు వారి దగ్గర డబ్బులు తీసుకుని రసీదులు ఇవ్వకుండా ఆ సొమ్ము స్వాహా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకునే పనిలో డీఐజీ రూప ఇప్పుడు బిజీ అయ్యారు.

English summary
D Roopa, the Karnataka police officer who had alleged that AIADMK chief VK Sasikala is enjoying VIP facilities in a Bengaluru prison, was transferred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X