వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: 2014 నుంచి 2019 వరకు మోడీ తనలో తాను గమనించిన మార్పులేమిటి ..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

2014-19 మధ్య మోడీలో వచ్చిన మార్పులేంటి..? || Oneindia Telugu

ఢిల్లీ: 2014 నాటి మోడీకి 2019 నాటి మోడీలో చాలా మార్పులు వచ్చినట్లు తెలిపారు ప్రధాని. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. 2014లో బీజేపీని పూర్తి స్థాయిలో సొంతంగా మెజార్టీ తీసుకురావడంలో నాడు ఎంతో కష్టపడిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఇక 2019 ఎన్నికల నాటికి తనలో తనకే మార్పులు కనిపించాయని చెప్పారు. 2014కు 2019కి మధ్య మోడీలో వచ్చిన మార్పులేంటి..?

 2019 నాటికి జీర్ణశక్తి బాగా పెరిగింది

2019 నాటికి జీర్ణశక్తి బాగా పెరిగింది

2014కు 2019కి మధ్య తనలో ఎన్నో మార్పులు కనిపించాయని అన్నారు ప్రధాని మోడీ. ఈ సమయంలో తన జీర్ణశక్తి బాగా పెరిగిందని చెప్పారు. అవమానాలను చాలా సులభంగా జీర్ణించుకోగలుగుతున్నానని ప్రధాని మోడీ సెటైర్ వేశారు. విపక్షాలు గాంధీ నెహ్రూ కుటుంబాలతో సహా తనను ఎవరెవరు ఏ విధంగా అవమానించారో ఒక పెద్ద జాబితానే ఇవ్వగలనని మోడీ అన్నారు. ప్రియాంకా గాంధీ తనను దుర్యోధనుడిగా పేర్కొందని, సంజయ్ నిరుపమ్ తనను ఔరంగజేబుగా అభివర్ణించాడని, దీన్ దయాల్ బైరవ తనపై హిందూ ఉగ్రవాది ముద్ర వేశారని, నారాయణ్ రాణే తనను నపుంసకుడని విమర్శించాడని ప్రధాని మోడీ చెప్పారు. ఇవ్వనిట్టినీ చాలా సులభంగా జీర్ణించుకోగలిగానని తెలిపారు. 2016లో కూడా చాలా మంది తనను పలు పేర్లతో పిలిచారని గుర్తు చేశారు ప్రధాని మోడీ. 2016లో ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను బ్రోకర్ అన్నాడని, 2007లో సోనియాగాంధీ తనను చావులపై వ్యాపారం చేసేవాడినని అన్నారని మోడీ గుర్తు చేశారు.

ఉమ్మడి ఏపీ సీఎం అంజయ్యను కాంగ్రెస్ ఎలా అవమానించింది..?

ఉమ్మడి ఏపీ సీఎం అంజయ్యను కాంగ్రెస్ ఎలా అవమానించింది..?

ఇక పదవికి గౌరవం ఇచ్చి మాట్లాడటం అంటే అందరినీ ఒకేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు మోడీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దళితుడైన అంజయ్యను విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంతగా అవమానించిందో ఎలా అవమానించిందో అందరికీ తెలిసిందే. ఒకరిపై వేలెత్తి మాట్లాడే ముందు తమవైపు నాలుగు వేళ్లు చూపిస్తుంటాయన్న సంగతి మరవకూడదని మోడీ హితవు పలికారు. ఇక మమతా బెనర్జీ గురించి మాట్లాడిన ప్రధాని ఆమె మాట తీరుపై అక్కడి విలేఖరులను అడిగితే బాగుంటుందని చెప్పారు. ఆమె మాట తీరు వల్ల రాష్ట్రానికి ఏమైనా మేలు చేకూర్చుతుందా అని ప్రధాని ప్రశ్నించారు. ఆమె వాడుతున్న భాష సరైనదేనా అని సూటి ప్రశ్న వేశారు ప్రధాని.

కాంగ్రెస్ పార్టీ ''తిట్ల డిక్షనరీ '' అందులో ప్రేమ కూడ ఉంటుంది ! ఇది సినిమా క్యాప్షన్ కాదుకాంగ్రెస్ పార్టీ ''తిట్ల డిక్షనరీ '' అందులో ప్రేమ కూడ ఉంటుంది ! ఇది సినిమా క్యాప్షన్ కాదు

యువత వారసత్వ రాజకీయాలను కోరడం లేదు

యువత వారసత్వ రాజకీయాలను కోరడం లేదు

2019 ఎన్నికలు చాలా ప్రత్యేకమని చెప్పారు మోడీ. 21 శతాబ్దంలో పుట్టిన వారు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వాల తప్పిదాలతో ఇబ్బంది పడ్డ యువత తమ ప్రభుత్వంలో మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని అన్నారు. వారసత్వ రాజకీయాలతో యువత విరక్తి చెందిందని మోడీ చెప్పారు. వారు కొత్త తరం రాజకీయాలు, అర్హత విలువలు ఉన్న ప్రభుత్వాల వైపు యువత చూస్తోందని అన్నారు. పాత తరం కులరాజకీయాలు చేసే పాఠశాలలు కోరుకోవట్లేదని చెప్పిన మోడీ... కొత్త తరం అభివృద్ధే అజెండాగా పనిచేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మోడీ పునరుద్ఘాటించారు.

English summary
Prime Minister Narendra Modi said that he himself had noticed many changes in him since 2014 to current year 2019. Modi in an interview said that his digestion powers have increased and that he was able to digest the insults with ease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X