వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ ఎం‘పవర్‌’మెంట్: భారత్ మారుతోంది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాం.. దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామంటూ ప్రతీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుంది. అయితే, నాయకత్వ లోపం, అసమర్థత, అవినీతి వల్ల ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు నిలదీస్తారు. అంతేగాక, ఎన్నికల సమయంలో వారు ఆ ప్రభుత్వానికి సరైన సమాధానం చెబుతారు. ఇప్పుడు కూడా ప్రజలు వారు ఎన్నుకునే ప్రభుత్వం తమ జీవితాలను మెరుగుపర్చాలనే కోరుకుంటారు. ప్రజల బలమైన కోరికే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైంది.

2014 ఎన్నికలకు ముందు భారత ప్రజలు అవినీతిపై పోరాటం చేశారు. ఈ క్రమంలోనే ప్రజలు నరేంద్ర మోడీపై నమ్మకం ఉంచి ప్రధాని పదవిని కట్టబెట్టారు. మోడీ మాటలు ఆచరణలోకి వస్తాయని వారు నమ్మారు. ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వం వారి నమ్మకాన్ని నిలబెట్టే కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది.

మే 2014లోనే దాగుడు మూతల ప్రభుత్వాన్ని ప్రజలు దించేశారు. వారు తమకు నేరుగా సమాచారాన్ని చేరవేసే ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ప్రభుత్వంలో పారదర్శకతను కోరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో విద్యుత్, న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ, మైన్స్ శాఖలు చేసే కార్యక్రమాలు ప్రజలకు పారదర్శకంగా ఉంటున్నాయి. యాప్స్ ద్వారా కావాల్సిన సమాచారాన్ని అందజేస్తున్నాయి. భారత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్న ప్రధాని హామీని నెరవేర్చేదిశగా ప్రభుత్వం సాగుతోంది.

 Digital Em‘Power’ment: Delivering on ‘RTI’- Right to a Transformed India

ప్రజలకు అందుబాటులో వివిధ పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం ఉంచుతోంది. అంతేగాక, యాప్స్ రూపంలో కావాల్సిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందిస్తోంది. ప్రజల చేతుల్లో ఉండే మొబైల్ ఫోన్లకు సమాచారాన్ని చేరవేస్తోంది. ఉదాహరణకు మీరు మీ జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించబడిందనే విషయం తెలుసుకునేందుకు గర్వ్(GARV)లోకి లాగాన్ అయితే సరిపోతుంది. మీరు ఉపయోగించిన విద్యుత్‌కు మీరు చెల్లించిన ధర ఎంతో తెలుసుకోవాలనుకుంటే.. మెరిట్(MERIT)ను ఉపయోగించవచ్చు. విద్యుత్ కోత విషయంలో ఆందోళన చెందుతున్నారా? ఆ అవసరం లేదు.. ఎందుకంటే ఉర్జా మిత్రా(URJA Mitra) మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే సమాచారాన్ని అందజేస్తుంది.

తామ్రా(TAMRA), తరంగ్(TARANG) వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. 2014కి ముందు మైనింగ్ వేలాన్ని రద్దు చేసే పరిస్థితి ఉండేదని, అయితే, 29 మైనింగ్ బ్లాక్స్ నుంచి గత మూడేళ్ల నుంచి రూ.1.22లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. తామ్రా, తరంగ్.. పారదర్శకతను పెంపొందించడంలో ఎంతో తోడ్పడుతోంది. 2011-14 మధ్య కాలంలో ప్రాజెక్టుల విలువకు 2014-17 మధ్య కాలంలో 83శాతం పెరిగింది. 2014-17 మధ్య కాలంలో 40శాతం ట్రాన్స్ మిషన్ కెపాసిటీ పెరిగింది.

2015లో ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. వెయ్యిరోజుల్లోగా దేశంలోనిప్రతీ గ్రామానికి విద్యుత్ అందిస్తామని ప్రధాని ప్రకటించారు. గర్వ్ ఇప్పటికే పూర్తిగా విజయవంతం కాగా, గర్వ్-2 లక్ష్యాలను అధిగమించేదిగా సాగుతోంది. వేగం, నైపుణ్యత, ప్రమాణికత మంత్రంతో ఈ పథకాలు ముందుకు సాగుతున్నాయి. మీడియాకు, ప్రజలకు వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతోంది. గ్రామాల్లోని దుకాణాలు, పిండీ చక్కీలు, ఇతర అప్లయెన్సెస్ పై వీటి ప్రభావం కనిపిస్తోంది.

ఇంతకుముందు డిస్కమ్స్ ద్వారా కొనుగోలు చేసే విద్యుత్‌లో అవినీతి బాగా జరిగేది. కానీ, మెరిట్ యాప్, విద్యుత్ ప్రవాహ్ వాటికి అవకాశం ఇవ్వలేదు. అంతేగాక, ఇవి ఖర్చులను తగ్గించేసింది. వచ్చే ఐదేళ్లలో మెరిట్.. వినియోగదారుల బిల్లులు తగ్గించడమే గాకుండా రూ.20వేల కోట్లు ఆదా చేసింది. ఉదయ్, ఉర్జాలు రాష్ట్రాలు/నగరాలు/డిస్కమ్స్‌ల ర్యాంకింగ్స్ మెరుగుపర్చాయి.

ఉజల యాప్ ఎల్ఈడీ బల్పులను ఏర్పాటు చేయడంలో ఎంతో దోహదం చేస్తోంది. 204 బొగ్గు గనులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేసిన నేపథ్యంలో విద్యుత్ ను ఆదా చేసేందుకు.. ఎన్ని ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయాలో చేయండి అని చెప్పారు ప్రధాని మోడీ. విద్యుత్ బిల్లులను ఆదా చేయడంతోపాటు కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించేందుకు ఈ ఎల్ఈడీ బల్పుల వాడకం తప్పనిసరి చేయడం జరిగింది.

మైనింగ్ సర్వేలెన్స్ సిస్టమ్(ఎంఎస్ఎస్) యాప్ ద్వారా మైనింగ్ అక్రమాలు జరగకుండా పారదర్శకత పెరిగింది. కోల్ మిత్ర థర్మల్.. పవర్ ప్లాంట్ల వివరాలు తెలియజేస్తుండగా.. అరుణ్.. సోలార్ రూఫ్ టాప్స్ ఇన్ స్టాలేషన్స్, ఇతర వివరాలను అందజేస్తుంది. అంతేగాక, చాలా యాప్ లు సమాచారాన్ని ఇచ్చేందుకు అందుబాటులో ఉన్నాయి. 1-800-200-300-4కు మిస్డ్ కాల్ చేసి యాప్ లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడింది. తమ సోమ జ్యోతిర్గమయ(వెలుగును నింపడం) అనే నినాదంతో అన్ని మంత్రిత్వ శాఖలు ముందుకు సాగుతున్నాయి. ఈ యాప్‌ల ఏ శాఖలోనూ అవినీతి జరగకుండా పారదర్శకత ఏర్పడుతోంది. దీంతో దేశంలోని 125కోట్ల మంది భారతీయులు ప్రభుత్వ సేవలపై నమ్మకం ఏర్పడింది.

-పీయూష్ గోయల్(భారత విద్యుత్, కోల్, పునరుత్పాదక వనరులు, గనుల శాఖ మంత్రి)

English summary
Every government comes to power with the promise of serving the people and making their country a better place to live in. When this promise is broken, by inefficiencies and corruption, people’s trust in their leadership is shaken, and they demand answers. In elections then, the people give their own answer to the government, and expectations are transferred to the next government. It is in such an atmosphere of anger and expectation that the Narendra Modi government came to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X