• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ సర్కార్ మరో సంచలనం -న్యూస్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, ఓటీటీలకు కళ్లెం -24 గంటల్లో తొలగించాలి

|

దేశంలో టెక్నాలజీ వాడకం బాగా పెరిగిపోయిన దశలో దాని ఆధారంగా నడిచే న్యూస్ వెబ్ సైట్లు, సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) సర్వీసులూ బహుగా విస్తరించాయి. అయితే, ఇన్నాళ్లూ వాటిపై ఏరకమైన నియంత్రణ లేకపోవడంతో తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్, అసభ్యకరమై, అభ్యంతరకరమైన డిజిటల్ కంటెంట్ వ్యాప్తిలోకి వచ్చింది. దీన్ని నియంత్రించడం కోసం కేంద్రంలోని మోదీ సర్కారు సంచలన ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. అయితే, ఈ కొత్త నిబంధనలతో ఫేక్ సమాచారం కట్టడితోపాటు నిజమైన, నిబంధనలతో కూడిన సమాచార ప్రవాహానికి కూడా కళ్లెం పడొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

చీకట్లో ఉంచి పూజలు.. దెబ్బతిన్న పేగులు, లివర్ -ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఉదంతంలో మిస్టరీచీకట్లో ఉంచి పూజలు.. దెబ్బతిన్న పేగులు, లివర్ -ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఉదంతంలో మిస్టరీ

డిజిటల్ రంగంపై కట్టడి..

డిజిటల్ రంగంపై కట్టడి..


భారత్‌లో డిజిటల్ మీడియా(న్యూస్ వెబ్ సైట్లు), సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కట్టడికి కేంద్రం సిద్ధమైంది. కొంత కాలంగా దీనిపై సాగిన కసరత్తు ఎట్టకేలకు నిబంధనల రూపంలో బయటికొచ్చాయి. డిజిటల్ కంటెంట్ ను కట్టడి చేసేందుకుగానూ కేంద్ర సమాచార, ఐటీ చట్టాల్లో కీలకమైన సవరణలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతానికి ముసాయిదాలుగా ఉన్న ఈ సవరణలు చట్టంగా ఆమోదం పొంది, అమలులోకి వస్తే డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై కేంద్రానికి నియంత్రణ లభించినట్లవుతుంది. ఫేక్ న్యూస్ కట్టడి కోసమే రూపొందించినట్లుగా చెబుతోన్న కొత్త నిబంధనల ముసాయిదా వివరాలను కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ లు గురువారం మీడియాకు వెల్లడించారు..

9,10,11 తరగతుల పరీక్షలు రద్దు -విద్యార్థులంతా పాస్, తర్వాతి క్లాసులకు ప్రమోట్ -సీఎం కీలక ప్రకటన9,10,11 తరగతుల పరీక్షలు రద్దు -విద్యార్థులంతా పాస్, తర్వాతి క్లాసులకు ప్రమోట్ -సీఎం కీలక ప్రకటన

ఇప్పుడున్న చట్టాలు సరిపోవు..

ఇప్పుడున్న చట్టాలు సరిపోవు..


భారత్‌లో బహుళంగా విస్తరించిన డిజిటల్ కంటెంట్ ను ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడున్న చట్టాలు సరిపోవన్న కేంద్ర మంత్రులు.. ఆన్ లైన్ కంటెంట్ ను మరింత సురక్షితంగా మార్చేందుకే కొత్త నిబంధనలతో ఐటీ చట్టాలను సవరించబోతున్నామని తెలిపారు. ఐటీ చట్టంలో మార్పుల ద్వారా సోషల్‌ మీడియా గ్రూపులు, యాప్‌లతో పాటు ఓటీటీల్లో ఫేక్ సమాచార కట్టడికి వీలవుతుందని, ఫేక రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని మంత్రులు తెలిపారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా కొత్త నిబంధనలు ఉంటాయని, అభ్యకర పోస్టులను తక్షణం గుర్తించడం, ఇతరులను అగౌరవపరిచే రాతలపై కఠిన చర్యలు తీసుకోవడం లాంటి వెసులుబాటులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇక నిబంధనల విషయానికొస్తే..

ప్రతి మెసేజ్ ట్రేస్ అవుతుంది..

ప్రతి మెసేజ్ ట్రేస్ అవుతుంది..

ఐటీ చట్టంలో సవరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన కొత్త నిబంధనల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఇవి న్యూస్ వెబ్ సైట్లు, సోషల్ మీడియా, ఓటీటీలు మూడింటికీ వర్తిస్తాయి. వ్యక్తులు లేదా సంస్థలకు పరువుకు భంగం కలిగించే, అసభ్య, వివక్షా పూరితమైన, మైనర్లకు హానికరమైన, దేశ సార్వభౌమత్వం, రక్షణ, భద్రత, సమైక్యతకు ముప్పు కలిగించే డిజిటల్ కంటెంట్ పై నిషేధం. నేరపూరితమైన లేదా అక్రమమైన కంటెంట్ అని తమ దృష్టికి వచ్చిన 36 గంటల్లో లేదా కోర్టు ఆర్డర్ ప్రకారం ఆ పోస్టులను సోషల్ మీడియా సైట్లు తొలగించాలి. తప్పుడు సందేశాన్ని ముందు ఎవరు సృష్టించారో సోషల్ మీడియా సైట్లే నిర్ధారించాలి. ఫిర్యాదు వచ్చిన 72 గంటల్లో సైట్లు, సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ అధీకృత సంస్థకు వెంటనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు..

24 గంటల్లోపు తొలగించాలి..

24 గంటల్లోపు తొలగించాలి..


డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఓటీటీ సంస్థలు ఫిర్యాదులను నెలలోపు పరిష్కరించేందుకు ఓ గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమించుకోవాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అక్రమమైన లేదా నేరపూరితమైన కంటెంట్ ను ఇంటర్మీడియరీలు (వార్తా సంస్థలు, ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీలు) తొలగించాలి. కోడ్ ఆఫ్ ఎథిక్స్ అమలుకు మూడు దశల వ్యవస్థ ఏర్పాటు ఉంటుంది. స్వీయ నియంత్రణ, స్వీయ నియంత్రణ సంస్థల అధీనంలో స్వీయ నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలుగా అవి ఉంటాయి. కోడ్ ఆఫ్ ఎథిక్స్ కు సంబంధించి ఏవైనా ఉల్లంఘనలు జరిగితే ప్రభుత్వానికి ప్రజలు ఫిర్యాదు చేసేలా ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు
15 రోజుల్లోగా సమస్యల పరిష్కారం చూపుతారు. కాగా, ఇప్పటికే ‘వన్ ఇండియా' సహా కొన్ని ప్రముఖ న్యూస్ వెబ్ సైట్లు ఫేక్ న్యూస్ కట్టడికి, కంటెంట్ అథెంటింటిసిటీకి ప్రాధాన్యం ఇస్తుండటం తెలిసిందే.

English summary
The government today announced new rules to regulate digital content and establish what it called a "soft touch progressive institutional mechanism with level-playing field" featuring a Code of Ethics and a three-tier grievance redressal framework for news sites and OTT platforms. The rules will empower users of social media, said Union IT Minister Ravi Shankar Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X