వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థానీలకు డిగ్గీ మద్దతు: విరుచుకుపడ్డ నెటిజన్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ నటులకు తన మద్దతు తెలిపి విమర్శలకు గురవుతున్నారు. శనివారం ఆయన ట్విటర్‌ ద్వారా తన మనోభావాలను పంచుకున్నారు.

తాను పాకిస్థానీ కళాకారులకు మద్దతిస్తున్నానన్నారు. వాళ్ళను భారతదేశంలో అనవసరంగా వెంటాడుతున్నారని చెప్పారు. పాకిస్థాన్ వంటి శత్రు దేశంలో వాళ్ళు అత్యుత్తమ రాయబారులు కాగలరని అభిప్రాయపడ్డారు. అయితే, డిగ్గీ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పాకిస్థానీయులనే ఓట్లు కూడా అడగండని మండిపడుతున్నారు. మరికొందరైతే ఇంకెందుకు ఆలస్యం పాకిస్థాన్‌కు వెళ్లిపోండంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

కాగా, యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడిలో 19 మంది భారతీయ సైనికులు అమరులు కావడంతో యావత్తు దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ కళాకారులపై నిషేధం విధించాలని కొందరు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ దర్శకత్వంలో వస్తున్న 'యే దిల్ హై ముష్కిల్'తో సహా పాకిస్థాన్ కళాకారులు నటించే సినిమాలను మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లలోని సింగ్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శించబోమని సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించింది.

అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పాకిస్థానీ కళాకారులకు వీసాలు జారీ చేయడంలో ఎటువంటి సమస్య లేదని స్పష్టం చేసింది. కాగా, మనదేశంలో రూపొందిన సినిమాలపై పాకిస్థాన్ తమ దేశంలో ఇప్పటికే నిషధం విధించింది.

English summary
Rajya Sabha MP Digvijay Singh on Saturday broke his silence on the Pakistani artistes controversy. The 69-year-old politician extended his support to the Pak actors by saying that they are 'unnecessarily being hounded' in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X