వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్ సింగ్ అట .. ఆ రాష్ట్ర మంత్రి కాంట్రవర్సీ కామెంట్..!!

|
Google Oneindia TeluguNews

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కూడా పాగా వేద్దామని కాచుకొని కూర్చొన్న బీజేపీకి .. అధికార కాంగ్రెస్ నేతల కామెంట్లు కలిసొస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో అక్రమ గనుల తవ్వకాలతో లక్షలు సంపాదించొచ్చని చేసిన కామెంట్లు మరవక ముందే మరో నేత నాలికి కరుచుకొన్నాడు. మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి ఉమాంగ్ సింగార్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఎంపీ సీఎం దిగ్విజయ్ సింగేనని .. ఆయన ఇటీవల కొందరు మంత్రులకు లేఖలు కూడా రాశారని బాంబ్ పేల్చారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది.

హస్తినలోని పాక్ హై కమిషన్ వద్ద ఉద్రిక్తత.. మత మార్పిడిని నిరసిస్తూ సిక్కుల ఆందోళన ...హస్తినలోని పాక్ హై కమిషన్ వద్ద ఉద్రిక్తత.. మత మార్పిడిని నిరసిస్తూ సిక్కుల ఆందోళన ...

అటవీశాఖ మంత్రి ఉమాంగ్ సింగార్ నిన్న తన సొంత నియోజకవర్గం దార్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల మంత్రులకు దిగ్విజయ్ సింగ్ పేరుతో వచ్చిన లెటర్ల గురించి ప్రస్తావించారు. సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న దిగ్విజయ్ సింగ్ .. వారం రోజుల క్రితం కొందరు మంత్రులకు లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది. ఆయా మంత్రులకు పలు సూచనలు కూడా చేశారని దుమారం చెలరేగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ 15 వరకు వివిధ శాఖల్లో అధికారుల బదిలీ, నియామకానికి సంబంధించి సూచనలు చేశారని పేర్కొన్నారు. ఆ సూచనలతో గత నెల 31న మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాటించిందనే రుమార్లు వినిపించాయి.

‘Digvijaya Singh running govt’, says Madhya Pradesh minister

దీనిపై సింగార్ స్పందిస్తూ .. మధ్యప్రదేశ్‌లో తెరవెనక ఉండి దిగ్విజయ్ సింగ్ పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయం అందరికీ తెలుసున్నారు. రాష్ట్రంలోని ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసని చెప్పారు. అయితే అతను లేఖ రాయాల్సిన అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. అతనే ప్రభుత్వం నడుపుతున్నప్పుడు .. ఆయన ఎందుకు లేఖ రాయాలి అని ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా తన మాటలకు కట్టుబడి ఉన్నానని సెంగార్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతుంది. మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. ప్రభుత్వంలోని ఓ మంత్రే ఆ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రానికి సీఎం ఎవరు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కమల్‌నాథ్ తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

English summary
A Madhya Pradesh minister’s statement that Congress leader Digvijaya Singh is running the government underlined the turf war in the grand old party in the state and gave enough ammunition to the opposition BJP which called for chief minister Kamal Nath’s resignation. Forest minister Umang Singhar’s comment on Sunday in his home town of Dhar came after he was asked about Digvijaya Singh’s recent letters to ministers through which he sought appointments to know about the action taken on issues he had raised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X