వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై ప్రశంస: శశి థరూర్‌కు దిగ్విజయ్ సింగ్ మద్దతు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గోనేందుకు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను అంగీకరించడం, మోడీని థరూర్ పొగడడంపై కేరళ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానికి నివేదించి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐతే కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ మాత్రం థరూర్‌కు మద్దతు తెలిపారు. కేరళ ఎంపీ (థరూర్) చర్యలో తప్పులేదన్నారు.

Digvijaya Singh supports Shashi Tharoor, party says it's their opinion

"'స్వచ్ఛ భారత్' బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు థరూర్ అంగీకరించడంలో ఎలాంటి తప్పులేదు. కాంగ్రెస్ కార్యక్రమమైన దాన్ని మోడీ అడాప్ట్ చేసుకున్నదే" అని ట్విట్టర్ లో పోస్టు చేశారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>I see nothing wrong in Shashi Tharoor accepting to be Brand Ambassador for Swachhta Abhiyan. It is Congress Party programme adopted by Modi.</p>— digvijaya singh (@digvijaya_28) <a href="https://twitter.com/digvijaya_28/status/520029256156332032">October 9, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

మోడీ గురించి శశి థరూర్ చేసిన ప్రశంసలు కేరళ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని కేరళ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) తెలిపింది. ఈ వ్యవహారంపై అధిష్టానికి నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

English summary
Facing flak from Congress for accepting Prime Minister Narendra Modi's invite to join Swachhta Abhiyan, former Union Minister Shashi Tharoor on Thursday got support from party general secretary Digvijaya Singh, who saw "nothing wrong" in the Kerala MP's actions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X