• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నటిపై లైంగికదాడి యత్నం కేసులో ప్రముఖ హీరో అరెస్టు

By Ramesh Babu
|

కొచ్చి: ప్రముఖ మలయాళ హీరో దిలీప్ అరెస్టయ్యారు. ఓ ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి యత్నం కేసులో దిలీప్ నిందితుడు. సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు.

సంచలనం: దేవుడు రమ్మంటున్నాడంటూ.. ఉరేసుకున్న ముగ్గురు మహిళలు

తెలుగుతోపాటు పలు దక్షిణాది సినిమాల్లో నటించిన ప్రముఖ కథానాయికను కారులో లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న రాత్రి వేళ తన వాహనంలో వెళుతున్న ఆమెను కొందరు అడ్డగించి ఆమె వాహనంలోనే ఆమెను రెండున్నర గంటలపాటు లైంగికంగా వేధించారు. అశ్లీలంగా ఆమెను ఫొటోలు, వీడియోలు తీశారు.

actor-dileep

ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సుని అలియాస్ సునీల్ కుమార్ అనే వ్యక్తిని, నటి ప్రయాణించిన వాహనం డ్రైవర్ మార్టిన్ తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసు వెనక పలువురు సినీ పెద్దల హస్తమున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళంలో ప్రముఖ హీరోల్లో ఒకరైన దిలీప్ ను రెండు వారాల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకుని 12 గంటల పాటు విచారించారు. దిలీప్ భార్య, నటి కావ్య కార్యాలయంలో కూడా ఇటీవల పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

తాజాగా హీరో దిలీప్ ను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. వ్యక్తిగత కక్షతోనే సదరు నటిని కిడ్నాప్ చేయించి, వేధించేందుకు కుట్ర పన్నినట్లు దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆ రోజు ఏం జరిగిందంటే...

త్రిశూర్ కు సమీపంలోని పత్తురైక్కల్ లో షూటింగ్ ముగించుకుని సాయంత్రం ఏడు గంటల సమయంలో ప్రముఖ నటి ఎస్ యూవీ వాహనంలో బయలుదేరింది. ఆ వాహనాన్ని కూడా ఆమె నటిస్తోన్న చిత్ర నిర్మాణ సంస్థ లాల్ క్రియేషన్స్ సమకూర్చినదే. కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్ లోని తన స్నేహితురాలి ఇంటికి సదరు నటి బయలుదేరింది. ఆమె వాహనం డ్రైవర్ మార్టిన్ మార్గంమధ్యలో కొంతమందికి ఎస్సెమ్మెస్ లు పంపాడు. దీంతో పల్సర్ సుని గ్యాంగ్ క్యాటరింగ్ వ్యాన్ లో నటి వాహనాన్ని వెంటాడింది.

నోటిని మూసి, ఫోన్ లాక్కుని...

రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నెడుంబసరీ విమానాశ్రయం కూడలి వద్ద ఆమె వాహనాన్ని ఆ కిరాయిమూక తమ క్యాటరింగ్ వ్యాన్ తో ఢీకొట్టింది. నటి వాహనం ఆగగానే.. ఇద్దరు నిందితులు (ఏ-2, ఏ-3) ఆమె కారులోకి చొరబడి.. తమ చేతులతో ఆమె నోటిని మూసేశారు. కేకలు వేయవద్దంటూ ఆమెను బెదిరించారు. ఆమె ఫోన్ ను బలవంతంగా లాక్కున్నారు. ఆ వాహనం కొంత దూరం ప్రయాణించిన తరువాత ఏ-3 నిందితుడు ( ఇతడి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు) కలంసెరీ వద్ద కారులోంచి దిగిపోగా, నల్ల టీషర్టు ధరించిన నాలుగో నిందితుడు నటి వాహనంలోకి ఎక్కాడు. ఆ తరువాత మరో ఇద్దరు నిందితులు ఆ వాహనంలోకి ప్రవేశించారు. సదరు నటి నోటిని బలవంతంగా మూసి, రూట్ మార్చి.. వాహనాన్ని ఓ ఇంటి ముందు ఆపారు.

అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసి...

అక్కడి నుంచి ప్రధాన నిందితుడు పల్సర్ సుని అలియాస్ సునీల్ కుమార్ రంగంలోకి దిగాడు. తన ముఖం కనిపించకుండా టవల్ కట్టుకుని వచ్చిన అతడు డ్రైవర్ సీటులోకి మారాడు. అప్పటి వరకు ఆ వాహనాన్ని నడిపిన మార్టిన్.. గ్యాంగ్ లోని మిగిలిన సభ్యులతో కలిసి క్యాటరింగ్ వాహనంలోకి ఎక్కాడు. పల్సర్ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్ కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. ఆమెను అశ్లీలంగా, అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీసేందుకు థర్డ్ పార్టీ తరుపున తాను వచ్చానని, తనకు సహకరించాలని అతడు సదరు నటితో చెప్పాడు. కాసేపు ఆమెను అసభ్యంగా చిత్రీకరించిన అనంతరం కక్కనాడ్ సమీపంలోని పాదముద్గల్ వద్ద ఎస్ యూవీ వాహనంలోంచి బయటికి గెంటేశాడు. సదరు నటి పట్ల ఈ అమానుషం దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగింది.

English summary
Shocking details continue to emerge in the Malayalam actress abduction case. Actor Dileep has now been arrested in connection with the case.Dileep's name got linked to the case after prime accused Pulsar Suni said in a statement to the police that he wrote a letter to the actor. Dileep denied knowing Pulsar Suni, but a selfie leaked to the media showed the accused on the sets of the actor's film Georgettan's Pooram. The actor was interrogated along with director Nadirshah for 13 hours to understand his involvement in the case, and his wife Kavya Madhavan's place of business was raided as well. Dileep has repeatedly claimed he is innocent and dragging his name in the Malayalam actress abduction case is an attempt to malign his image and credibility just before the release of his new movie Ramaleela.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more