వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛార్జీషీటులో ఏముంది?: నటిపై లైంగిక దాడి కేసులో ఆధారాలతో సిట్, దిలీప్‌కు చుక్కలేనా..

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసులో సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్) అధికారులు బలమైన సాక్ష్యాధారాలతో అంగమలై మెజిస్ట్రేట్ లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దిలీప్ రెండో భార్య మంజు వారియర్ తో సినీ నటి భావనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.

 ఛార్జీషీటులో ఏముంది?:

ఛార్జీషీటులో ఏముంది?:

గురువారం మధ్యాహ్నాం 3గం. తర్వాత సిట్ అధికారులు న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేశారు. అందులో హీరో దిలీప్ ను ఎనిమిదవ నిందితుడిగా పేర్కొన్నారు. మొత్తం 17సెక్షన్ల కింద అతనిపై కేసు పెట్టినట్టు అందులో పొందుపరిచారు.

కాగా, కావ్యా మాధవన్ తో దిలీప్ వివాహేతర సంబంధాలను బయటపెట్టినందుకే నటిపై అతను కక్ష పెంచుకున్నట్టు ఛార్జీషీటులో పేర్కొన్నారు. మంజు వారియర్‌తో ఉన్న స్నేహం కారణంగా.. దిలీప్ వ్యవహారం గురించి నటి ఆమెకు ఆధారాలతో సహా వివరించినట్టు అందులో తెలిపారు.

సీక్రెట్ 'లీక్' చేసిందనే!: నటి నగ్న ఫోటోలు తీయించి మరీ.. దిలీప్ చెప్పిన నిజం?సీక్రెట్ 'లీక్' చేసిందనే!: నటి నగ్న ఫోటోలు తీయించి మరీ.. దిలీప్ చెప్పిన నిజం?

 355మంది సాక్షులు:

355మంది సాక్షులు:

ఛార్జీషీటుకు సంబంధించి మొత్తం ఐదు కాపీలను సిట్ అధికారులు న్యాయస్థానానికి అందజేశారు. సిట్ నివేదిక ప్రకారం.. కేసుకు సంబంధించి 355మంది సాక్షులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో 50మంది సినిమా ఇండస్ట్రీకి చెందినవారు. నటి, దిలీప్ రెండో భార్య మంజు వారియర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

నటిపై లైంగిక దాడి: వెక్కి వెక్కి ఏడ్చిన దిలీప్ భార్య, ఆ ఇంట్లో 6గం. విచారణ..నటిపై లైంగిక దాడి: వెక్కి వెక్కి ఏడ్చిన దిలీప్ భార్య, ఆ ఇంట్లో 6గం. విచారణ..

 650పేజీల నివేదిక:

650పేజీల నివేదిక:

సిట్ అధికారుల ఛార్జీషీటులో 650పేజీలతో కూడిన నివేదిక ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధాన నిందితుడిగా పల్సర్ సునీని, రెండో నిందితుడిగా నటి డ్రైవర్ మార్టిన్ పేరును పేర్కొన్నారు. కేసులో మొత్తం 12మంది నిందితులుగా ఉన్నారు. ఇందులో విపిన్, అనీష్ అనే ఇద్దరు ఇప్పటికే అప్రూవర్స్ గా మారిపోయారు.

 దుబాయి వెళ్లేందుకు అనుమతి

దుబాయి వెళ్లేందుకు అనుమతి

నవంబర్ 28న దుబాయిలో దిలీప్ కు చెందిన రెస్టారెంట్ ఒకటి ప్రారంభం కానుంది. ఇందుకోసం నాలుగు రోజుల పాటు దుబాయి వెళ్లేందుకు తనకు అనుమతివ్వాల్సిందిగా హైకోర్టుకు దిలీప్ అప్పీల్ చేసుకున్నారు. సానుకూలంగా స్పందించిన కోర్టు అతనికి నాలుగురోజుల పాటు దుబాయి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఆ తీర్పు వెలువడిన మరుసటి రోజే ఛార్జీషీట్ దాఖలవడం గమనార్హం. సిట్ చార్జీషీట్ లో ఉన్న అంశాలతో కోర్టు ఏకీభవిస్తే దిలీప్ కు కఠిన శిక్ష పడటం ఖాయమంటున్నారు.

English summary
The Special Investigation Team (SIT) probing the high-profile case of a Malayalam actor's abduction and alleged sexual assault on February 17, submitted its chargesheet to the Angamaly Magistrate Court on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X